Advertisement

కేశినేనికి వార్నింగ్ ఇచ్చే ధైర్యం చంద్రబాబుకి వుందా.?

Posted : February 23, 2021 at 12:54 pm IST by ManaTeluguMovies

‘పార్టీ కోసం అందరూ కలిసి పనిచెయ్యాల్సిందే.. గెలుపోటములు శాశ్వతం కాదు. అందర్నీ అందరూ కలుపుకుపోవాలి తప్ప, అహంకార ధోరణి ప్రదర్శిస్తే కుదరదు..’ అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, సూచిస్తున్నా.. ఏం చేసినా టీడీపీలో అంతర్గత కల్లోలం మాత్రం తగ్గడంలేదు. ఈ తరహా వ్యవహారానికి సంబంధించి ఎంపీ కేశినేని నాని వెరి వెరీ స్పెషల్. చంద్రబాబుపై పలుమార్లు ధిక్కార స్వరం విన్పించారాయన. అయితే, కేశినేని నాని ఎట్టిపరిస్థితుత్లోనూ టీడీపీని వీడే అవకాశం కన్పించడంలేదు. అదే సమయంలో, టీడీపీలో ఆయన సర్దుకుపోయే పరిస్థితీ కన్పించడంలేదు. సొంత పార్టీలోనే ‘కుంపటి’లా తయారయ్యారన్నమాట కేశినేని నాని.

‘నేను గెలిచిన వ్యక్తిని.. ఓడిపోయినవారు నా మీద పెత్తనం చేస్తానంటే కుదరదు..’ అంటూ కేశినేని తాజాగా చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో పెను దుమారం బయల్దేరింది. ఈ వ్యవహారంపై అధినేత గుస్సా అయ్యారు. టీడీపీ అనుకూల మీడియా సంగతి సరే సరి. ‘కేశినేని నానికి చంద్రబాబు వార్నింగ్’ అంటూ ప్రచారం చేసింది పచ్చ మీడియా. దానికి కేశినేని నాని తనదైన స్టయిల్లో సమాధానమిచ్చారు.

మరోపక్క, కేశినేని నానితో సర్దుకుపోలేనంత విభేదాలేమీ లేవని టీడీపీ నేత బుద్ధా వెంకన్న తాజాగా సెలవిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. నానికీ, వెంకన్నకీ మధ్య బెజవాడ కేంద్రంగా గత కొద్ది రోజులుగా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిసారీ బుద్ధా వెంకన్నని కేశినేని కెలకడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్యా మాటల యుద్ధం తెరపైకి రావడం, ఈ క్రమంలో బెజవాడ కొబ్బరి చిప్పలనే ఆరోపణలు వినిపిస్తుండడం తెలిసిన సంగతులే.

మొత్తమ్మీద బుద్ధా వెంకన్న సర్దుకుపోయారు చంద్రబాబు సూచనతో. ఇంకేముంది కేశినేని నాని కూడా చల్లబడ్డారు. బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీలో ఈ అలజడి.. పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ‘ఇందుకే కదా పార్టీ సర్వనాశనమైపోతున్నది..’ అంటూ తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు. నిజమే మరి.. పార్టీ నేతలపై అధినేతకు ‘పట్టు’ లేదు, అధినేత మీద పార్టీ నేతలెవరికీ నమ్మకం లేదు. అందుకే టీడీపీకి ప్రస్తుత దుస్థితి దాపురించింది.


Advertisement

Recent Random Post:

రాజధాని పనుల పునఃప్రారంభానికి అడుగులు | Amaravati Capital Works Starts Soon

Posted : November 5, 2024 at 12:16 pm IST by ManaTeluguMovies

రాజధాని పనుల పునఃప్రారంభానికి అడుగులు | Amaravati Capital Works Starts Soon

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad