Advertisement

ఆరు ఏళ్ల ప్రయాణంకు కేజీఎఫ్ స్టార్ ఫుల్ స్టాప్

Posted : February 22, 2022 at 3:10 pm IST by ManaTeluguMovies

దేశం మొత్తం సినీ అభిమానులు కేజీఎఫ్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భాష తో సంబంధం లేకుండా కేజీఎఫ్ సినిమా ప్రతి ఒక్క ఇండియన్ సినీ అభిమానిని అలరించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా కు సీక్వెల్ గా రూపొందిన సినిమా కేజీఎఫ్ 2. దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల అదుగో ఇదుగో అంటూ వాయిదా పడుతూ వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.

కరోనా వల్ల కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయ్యింది. షూటింగ్ పూర్తి అయిన తర్వాత విడుదల తేదీకి చాలా సమయం ఉండటంతో పలు సందర్బాల్లో రీ షూట్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అసలు విషయం ఏమో కాని కేజీఎఫ్ సినిమా కోసం హీరో ప్రశాంత్ నీల్ ఏకంగా ఆరు సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్నాడు. ఈ ఆరు సంవత్సరాల్లో ఆయన మరే సినిమాకు కమిట్ అవ్వలేదు.

బాహుబలి సినిమా కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో ఈ సినిమా కోసం కూడా యశ్ కష్టపడ్డాడు అనడంలో సందేహం లేదు. ఈ ఆరు ఏళ్లు కూడా ఒకే తరహా లుక్ ను మెయింటెన్ చేయడం కోసం ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటాడు అనడంలో సందేహం లేదు. కేజీఎఫ్ 2 షూటింగ్.. రీ షూటింగ్ పూర్తి అయ్యింది. తాజాగా సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను కూడా యశ్ ముగించినట్లుగా తెలుస్తోంది.

కేజీఎఫ్ 2 కోసం డబ్బింగ్ చెప్పడంతో ఆరు ఏళ్ల కేజీఎఫ్ ప్రయాణంకు యశ్ ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది. ఇక సినిమా విడుదల సమయంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటే సరిపోతుంది. సినిమా విడుదల కు ఇంకా సమయం ఉంది కాని.. రీ షూట్ కు కాని ఇతర ఎలిమెంట్స్ జోడించే విషయమై దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్దంగా లేడు. అందుకే అతి త్వరలోనే ఫస్ట్ కాపీని సిద్దం చేసేసి కేజీఎఫ్ 2 క్లోజ్ చేయాలని భావిస్తున్నాడట.

యశ్ నుండి తదుపరి సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. పలువురు సౌత్ దర్శకులు మొదలుకుని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వరకు యశ్ తో వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. కాని కేజీఎఫ్ 2 మొత్తం పనైపోయిన తర్వాతే యశ్ తదుపరి సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఏప్రిల్ 14న ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. కన్నడంలో రూపొందిన కేజీఎఫ్ 2 ను తెలుగు.. హిందీ.. తమిళం మరియు మలయాళం లో కూడా విడుదల చేయబోతున్నారు.


Advertisement

Recent Random Post:

రాజముద్రతోనే పట్టా బుక్కులు | Royalty Seal on Pattadar Pass Books | Land Titling Act | Chandrababu

Posted : May 10, 2024 at 11:48 am IST by ManaTeluguMovies

రాజముద్రతోనే పట్టా బుక్కులు | Royalty Seal on Pattadar Pass Books | Land Titling Act | Chandrababu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement