Advertisement

కేజీఎఫ్ నుండి ఇంకా బయటకు రాలేక పోతున్నాడా..?

Posted : June 6, 2022 at 3:54 pm IST by ManaTeluguMovies

ఒక స్టార్ హీరోకు లేదా దర్శకుడికి బ్లాక్ బస్టర్ సక్సెస్ పడితే తదుపరి సినిమాల విషయంలో కాస్త టైమ్ పడుతుంది. ఆ స్థాయి సక్సెస్ ను దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో వెయిట్ చేసి చేసి ఆ తర్వాత కొత్త సినిమాను మొదలు పెడతారు. హీరోలు మరియు హీరోయిన్స్ అదే పంథాను అనుసరిస్తారు. ఎవరో ఒక్కరు ఇద్దరు ఫిల్మ్ మేకర్స్ స్టార్స్ తప్ప సక్సెస్ దక్కినా లేదా ప్లాప్ అయినా కాస్త ఎక్కువ సమయం గ్యాప్ తీసుకోవడం మనం చూస్తున్నాం.

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం కేజీఎఫ్ 2 విడుదలకు ముందే ప్రభాస్ తో సలార్ సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమా విజయం సాధించి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసినా కూడా వెంటనే తన పనిలో పడిపోయాడు.

కాని హీరో యశ్ మాత్రం ఇంకా కేజీఎఫ్ నుండి బయటకు రాలేక పోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కేజీఎఫ్ 2 తర్వాత వెంటనే యశ్ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కాని ఇప్పట్లో యశ్ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

కన్నడంలో స్టార్ హీరో అయిన యశ్ మొదటి కేజీఎఫ్ విడుదల అయిన వెంటనే ఒక సినిమాను చేస్తాడని.. ఆ తర్వాత కేజీఎఫ్ 2 ఉంటుందని అనుకున్నారు. కాని రెండు కేజీఎఫ్ ల మద్య కాస్త ఎక్కువ గ్యాప్ వచ్చినా మరే సినిమాను కూడా యశ్ చేయలేదు. ఇప్పుడు కేజీఎఫ్ 2 తో ఏకంగా వెయ్యి కోట్ల సినిమా తన ఖాతాలో పడింది. ఆ స్థాయిలో కాకున్నా అటు ఇటుగా అయినా ఉండేలా సినిమాను అభిమానులు ఆశిస్తారు.

అందుకోసం మంచి కథతో పాటు మంచి డైరెక్టర్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. కన్నడంలో ఆ స్థాయి దర్శకుడు ఉన్నాడా అనేది చర్చనీయాంశం. యశ్ తో బయటి దర్శకులు కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. కాని ఇప్పటి వరకు యశ్ ఏ ఒక్క సినిమాకు కూడా ఓకే చెప్పలేదు అంటూ వార్తలు వస్తున్నాయి.

హీరోగా యశ్ ను ప్రశాంత్ నీల్ ఆకాశాన తీసుకు వెళ్లి కూర్చోబెట్టాడు. అక్కడ యశ్ ప్రయాణం సాగించడం చాలా కష్టంగా మారింది. అక్కడ నుండి కింద పడుతాడా లేదంటే మరో మంచి సినిమా తో మరింత హై కి వెళ్తాడా అనేది చూడాలి. యశ్ మరియు ప్రశాంత్ నీల్ ల కాంబోలో మరో సినిమా ఉంటుందనే వార్తలు కన్నడ మీడియా సర్కిల్స్ లో జోరుగా వస్తున్నాయి. కాని ఆ సినిమా ఇప్పట్లో రాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ లోపు ఏదో ఒక సినిమాను లేదా సినిమాలను యశ్ చేసుకోవాల్సిందే..!


Advertisement

Recent Random Post:

కరెంట్ పై కేటీఆర్ ట్వీట్.. రేవంత్ రెడ్డి కౌంటర్ : CM Revanth Reddy Exclusive Interview

Posted : May 10, 2024 at 2:01 pm IST by ManaTeluguMovies

కరెంట్ పై కేటీఆర్ ట్వీట్.. రేవంత్ రెడ్డి కౌంటర్ : CM Revanth Reddy Exclusive Interview

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement