Advertisement

కెజిఎఫ్ 2- అసలు సిసలైన ఘట్టం కోసమే అందరి నిరీక్షణ.!

Posted : May 12, 2020 at 1:42 pm IST by ManaTeluguMovies

సౌత్ నుంచి వచ్చిన చిత్రాల్లో బాహుబలి అనే సినిమా ఇండియా వైడ్ ఏ రేంజ్ లో సౌండ్ చేసిందో అదే రేంజ్ లో రాకీ భాయ్ పేరు కూడా అదే ‘కెజిఎఫ్’ చాప్టర్ 1 కూడా అదే రేంజ్ లో వినిపించింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా సింపుల్ గా రిలీజైన ఈ సినిమా దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ అయ్యింది. ప్రస్తుతం అందరూ ఈ సినిమా చాప్టర్ 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు.

అనుకున్న దాని ప్రకారం అయితే ఈ ఏడాది అక్టోబర్ 23న రిలీజ్ కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ వాయిదా పడడంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడనుంది. ఇదిలా ఉంచితే అసలు ఈ సినిమా షూటింగ్ ఎంత అయ్యింది, ఇంకా ఎన్ని రోజులు తీస్తారు అనే విషయం గురించి తెలుసుకోగా.. రెండ్ మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్ మినహాయిస్తే ఒక 5-10% టాకీ పార్టీ మాత్రమే బాలన్స్ ఉందట. మొత్తంగా ఒక 25 నుంచి 30 రోజుల్లో షూటింగ్ మొత్తం అయిపోతుందని సమాచారం.

రెండు యాక్షన్ ఎపిసోడ్స్ కి ఎందుకంత టైం అని తెలుసుకోగా.. కెజిఎఫ్ చాప్టర్ 2 లో అందరూ ఎదురు చూసే యష్ – సంజయ్ దత్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయాల్సి ఉంది. ఇది సినిమా మొత్తానికి చాలా కీలకమైన ఘట్టం.. ఈ ఫైట్ మీద ప్రేక్షకులకి భారీగానే అంచనాలు ఉన్నాయి. అందుకే ఆ ఎపిసోడ్ కి కాస్త టైం పడుతుందని తెలిపారు.

షూటింగ్స్ మొదలై, ఎప్పుడు షూట్ మొదలవుతుందో దాన్ని బట్టి రిలీజ్ డేట్ ని రీ షెడ్యూల్ చేయనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యష్, నిధి శెట్టిలు హీరో హీరోయిన్స్ గా ఎదురు చూస్తున్నారు.


Advertisement

Recent Random Post:

భర్త పై పోటీ నుంచి తప్పుకున్న దువ్వాడ వాణి | Duvvada Srinivas Rao | Tekkali | AP Elections 2024

Posted : April 23, 2024 at 12:44 pm IST by ManaTeluguMovies

భర్త పై పోటీ నుంచి తప్పుకున్న దువ్వాడ వాణి | Duvvada Srinivas Rao | Tekkali | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement