Advertisement

సక్సెస్ ఫుల్ అగ్రదర్శకుడికి శుభాకాంక్షల వెల్లువ..!

Posted : June 15, 2021 at 8:35 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. సినీరచయితగా కెరీర్ ప్రారంభించిన కొరటాల మిర్చి సినిమాతో దర్శకుడుగా మారాడు. ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ అయ్యేసరికి ఒక్కసారిగా రైటర్ శివ కాస్తా పూర్తిగా డైరెక్టర్ శివ అనిపించుకున్నాడు. ఆ వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు అనే సినిమా తెరకెక్కించాడు. సెకండ్ మూవీ కూడా సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా వసూళ్లు కూడా బాగానే రాబట్టింది. అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ సినిమా చేసాడు. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో హ్యాట్రిక్ హిట్స్ దర్శకుడు అనిపించుకున్నాడు.

దర్శకుడుగా కెరీర్ మొదలయ్యాక వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టాలంటే ఖచ్చితంగా ఎంతో కృషి – సరైన కంటెంట్ ఉండాలి. మరి హ్యాట్రిక్ తోనే ఆగిపోయాడా అంటే అదికూడా కాదు. మహేష్ బాబును ముఖ్యమంత్రిగా పెట్టి ఓ సినిమా చేసాడు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ నమోదు చేసింది. దర్శకుడుగా ఇన్నేళ్ల కెరీర్ లో కొరటాల తీసిన సినిమాలు 4. కానీ ఆ నాలుగు సినిమాలు ఎంత టాలీవుడ్ ఇండస్ట్రీలో చూపించిన ఇంపాక్ట్ మాత్రం మాములుగా లేదు. అందుకే ఇప్పుడు కొరటాలతో ఏ హీరో అయినా సినిమా చేసేందుకు రెడీ అంటున్నారు.

ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమా రూపొందిస్తున్నాడు. సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం కొరటాల పుట్టినరోజు కావడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కొరటాలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొరటాల తదుపరి సినిమా కూడా ఎన్టీఆర్ తోనే చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా కొరటాల శివకు బర్త్ డే విషెస్ తెలిపాడు. అదికూడా అచ్చమైన తెలుగులో చెప్పడం విశేషం. “స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఎన్టీఆర్ తన ప్రేమను బయట పెట్టేశాడు. అలాగే ఎన్టీఆర్ తో పలువురు హీరోలు – ప్రొడక్షన్ హౌసెస్ కూడా విషెస్ తెలిపాయి. సాయిధరమ్ టేజ్ – రాంచరణ్ లతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్స్ కూడా కొరటాలకు శుభకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఆచార్యతో పాటు ఎన్టీఆర్ సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.


Advertisement

Recent Random Post:

Kadiyam లో వివాహితపై సామూహిక అ*త్యా*చారం

Posted : November 2, 2024 at 1:20 pm IST by ManaTeluguMovies

Kadiyam లో వివాహితపై సామూహిక అ*త్యా*చారం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad