Advertisement

కొరటాల తదుపరి చిత్రం ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

Posted : April 24, 2020 at 6:29 pm IST by ManaTeluguMovies

కెరీర్‌ ఆరంభం నుండి వరుసగా చిత్రాలు చేస్తూ సక్సెస్‌లను దక్కించుంటున్న కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో ఆచార్య చిత్రాన్ని చేస్తున్నాడు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న సమయంలో అనూహ్యంగా కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఆగిపోయిన విషయం తెల్సిందే. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే మళ్లీ ఈ సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించబోతున్నారు. ఆచార్య కోసం దాదాపు రెండేళ్ల పాటు వెయిట్‌ చేయించిన కొరటాల శివ తదుపరి చిత్రంకు ఆరు ఏడు నెలల కంటే ఎక్కువ తీసుకోడట.

భరత్‌ అనే నేను చిత్రం తర్వాత పలు కారణాల వల్ల ఆచార్య చిత్రం ఆలస్యం అవుతూ వస్తుంది. ఇప్పుడు కరోనా వల్ల ఆలస్యం అవుతుంది. ఇప్పటికే చాలా లేట్‌ అయ్యింది. అయిదు ఆరు సంవత్సరాల తర్వాత సినిమాలకు కొరటాల గుడ్‌ బై చెప్పాలనుకుంటున్నాడట. అప్పటి వరకు ఎక్కువ సినిమాలు చేయాలనే కుద్దేశ్యంతో ఆచార్య తర్వాత వెంటనే విజయ్‌ దేవరకొండతో ఈయన సినిమాను చేసేందుకు ఇప్పటికే రెడీ అయినట్లుగా సమాచారం అందుతోంది.

తాజాగా ఈయన బిదిరియల్‌మ్యాన్‌ ఛాలెంజ్‌ను పూర్తి చేసి విజయ్‌ దేవరకొండను మళ్లీ ఛాలెంజ్‌ చేయడం జరిగింది. అంటే ఇద్దరి మద్య చర్చలు జరుగుతున్నట్లే కదా అంటూ కొందరు లాజిక్‌లు తీస్తున్నారు. రాజమౌళి ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా హీరోలను నామినేట్‌ చేశాడు కనుక కొరటాల శివ కూడా తాను త్వరలో చేయబోతున్న విజయ్‌ దేవరకొండను నామినేట్‌ చేసి ఉంటాడు అంటున్నారు. విజయ్‌ దేవరకొండ కోసం ఎక్కువ టైం వెయిట్‌ చేయకుండా, తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో రౌడీ స్టార్‌ను ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.

పరిస్థితి ఇదే సీరియస్‌గా ఉంటే, వ్యాక్సిన్‌ ఇప్పట్లో రాకుంటే ఆచార్య చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అందుకే విజయ్‌ దేవరకొండ, కొరటాల కాంబో మూవీ కూడా వచ్చే ఏడాది వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా ప్రారంభం అయ్యి, వచ్చే ఏడాదే చివర్లో ప్రేక్షకుల ముందుకు వీరి కాంబో మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Advertisement

Recent Random Post:

పుత్తడి జోరుకు బ్రేక్ | Gold Prices To Decrease In Coming Days

Posted : November 7, 2024 at 10:12 pm IST by ManaTeluguMovies

పుత్తడి జోరుకు బ్రేక్ | Gold Prices To Decrease In Coming Days

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad