Advertisement

కొరటాల శివ మూవీలో అల్లు అర్జున్ రోల్ ఇదేనా?

Posted : July 26, 2020 at 3:15 pm IST by ManaTeluguMovies

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రను పోషించనున్నట్లు ఇప్పటికే అధికారికంగా వెల్లడైంది. మార్చ్ లోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉన్నా కరోనా వైరస్ కారణంగా ఆ ప్రయత్నాలు వెనక్కి వెళ్లాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం షూటింగులు ఏం జరగట్లేదు కాబట్టి దర్శకులు తమ తర్వాతి సినిమాలకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టేసారు.

ఇదే క్రమంలో దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం తాను చేస్తోన్న ఆచార్య సినిమా తర్వాత చేయాల్సిన చిత్రం గురించి ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం తన తర్వాతి చిత్ర స్క్రిప్ట్ పనులపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆచార్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దర్శకత్వంలో కొరటాల శివ సినిమా ఉంటుందని సమాచారం.

ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తుందని సమాచారం. స్టూడెంట్ లీడర్ గా అల్లు అర్జున్ కొరటాల శివ మూవీలో ఉండబోతున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం త్వరలోనే వచ్చే అవకాశముంది.


Advertisement

Recent Random Post:

కాంట్రవర్సీలే కేరాఫ్ పాలిటిక్స్ నడిపిన నేత.. | Pinnelli Ramakrishna Reddy

Posted : June 28, 2024 at 12:21 pm IST by ManaTeluguMovies

కాంట్రవర్సీలే కేరాఫ్ పాలిటిక్స్ నడిపిన నేత.. | Pinnelli Ramakrishna Reddy

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement