Advertisement

లేడి అసిస్టెంటుకు ఛాన్సిస్తున్న కొరటాల?

Posted : April 13, 2020 at 2:18 pm IST by ManaTeluguMovies

ఇప్పటిదాకా ఫెయిల్యూర్ రుచిచూడని ఇద్దరు దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్స్ అందుకున్న కొరటాల శివ, ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ‘ఆచార్య’కు బ్రేక్ పడడంతో ఖాళీ సమయంలో అదిరిపోయే స్కెచ్ రెఢీ చేశాడట కొరటాల. సుకుమార్ మాదిరిగా ఓ సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి, తన అసిస్టెంట్స్‌కు అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడని సమాచారం.

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పెట్టిన లెక్కల మాస్టార్, తాను రాసిన కథలను ఇచ్చి ‘కుమారి 21ఎఫ్’, ‘దర్శకుడు’ వంటి సినిమాలను నిర్మించారు. ఇప్పుడు కొరటాల కూడా సుక్కూ దారిలోనే నడుస్తున్నాడని టాక్. బేసిగ్గా రైటర్ అయిన కొరటాల శివ కొన్ని వందల పుస్తకాలు రాసారట.

ఆ కథలతో తన అసిస్టెంట్స్‌ను డైరెక్టర్స్‌‌గా మార్చాలని కొరటాల ప్లాన్. మొదటగా కొరటాల శివ దగ్గర కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఓ లేడీ అసిస్టెంట్‌కు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడని, లాక్‌డౌన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన ఉంటుందట.

భారీ రెమ్యూనరేషన్ తీసుకునే టాలీవుడ్ దర్శకుల్లో ఒకడైన కొరటాల శివ, నిర్మాతగానూ సక్సెస్ అందుకుంటాడమో చూడాలి. అయితే ఇప్పటివరకు ప్రొడక్షన్‌ మొదలుపెట్టిన చాలామంది దర్శకులు.. వారి శిష్యులను పూర్తిగా దర్శకత్వం చేయనివ్వకుండా, వారి అన్నింట్లో తలదూర్చడం ఒక బ్యాడ్ యాంగిల్ అనే చెప్పాలి. మరి కొరటాల అయినా ఆ విధానానికి స్వస్తి పలుకుతాడేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

Super Prime Time : అలా ముగిసింది | Lokshabha Elections 2024 –

Posted : May 30, 2024 at 9:59 pm IST by ManaTeluguMovies

Super Prime Time : అలా ముగిసింది | Lokshabha Elections 2024 –

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement