Advertisement

బాయ్ కాట్ చైనా: ట్రోలింగ్ కు గురైన బిగ్ బాస్ కౌశల్

Posted : June 23, 2020 at 6:47 pm IST by ManaTeluguMovies

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా అప్పట్లో ఎంతటి ప్రభంజనం సృష్టించాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా విషయాన్ని ఓవర్ ది టాప్ లా చేసే వ్యక్తిత్వమున్న కౌశల్ కు ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉన్నారో, వ్యతిరేకులు ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా అదే రేంజ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఇండియాలో బాయ్ కాట్ చైనా అనే ఉద్యమం జరుగుతోన్న విషయం తెల్సిందే. చైనా వస్తువులను బ్యాన్ చేయాలని కొన్ని వర్గాలు పోరాడుతున్నాయి. ప్రజలు కూడా చైనా వస్తువులు, ఉత్పత్తులు వాడొద్దని అంటున్నారు. ఈ నేపథ్యంలో కౌశల్ ఈ మూవ్ మెంట్ పై వింతగా స్పందించాడు.

తన దగ్గర ఉన్న ఒప్పో ఫోన్ ను నేలకేసి కొట్టి చైనా ఉత్పత్తులను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. వివరాల్లోకి వెళితే కౌశల్ మండాకు బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు ఒప్పో ఫోన్ గిఫ్ట్ గా వచ్చింది. అప్పటినుండి దాన్ని వాడుతూ వస్తోన్న కౌశల్, ఇప్పుడు నేను చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేస్తున్నాను అని చెప్పి ఆ ఫోన్ ను నేలకేసి బలంగా కొట్టాడు, తర్వాత ఆ విరిగిన ఫోన్ ను అక్కడే ఉన్న డస్ట్ బిన్ లో పడేసాడు. దీనిపై ఇప్పుడు ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది.

బాయ్ కాట్ చైనా అంటే చైనా వస్తువులు కొనకుండా ఉండడమని, అంతేకాని ఉన్న వస్తువులను పాడు చేసుకోమని కాదని, ఇప్పటికే ఆ ఫోన్ వాడుతున్నాడు కాబట్టి అది పగలకొట్టడం వల్ల చైనాకు చెందిన ఉత్పత్తిదారులకు వచ్చిన నష్టమేం ఉండదు. పైగా ఒక సెలబ్రిటీ అయ్యుండి ఇలా తప్పుగా జనాల్ని డైరెక్ట్ చేయడం ఏమిటని కౌశల్ ను ప్రశ్నిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

AP CM Jagan Election Campaign | YCP Kadapa Dist Road Show

Posted : April 30, 2024 at 5:52 pm IST by ManaTeluguMovies

AP CM Jagan Election Campaign | YCP Kadapa Dist Road Show

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement