Advertisement

మరోసారి కృతి శెట్టి పేరు మారుమ్రోగిపోతుందట

Posted : November 30, 2021 at 7:36 pm IST by ManaTeluguMovies

ఇప్పుడు కుర్రాళ్లందరి నోటా వినిపించే మధురమైన మంత్రం పేరే కృతి శెట్టి. వెండితెరను స్పర్శించిన ఈ బంగారుబొమ్మను చూసి చూపు తిప్పుకున్నవారు లేరు. ఆమె అభిమానుల జాబితాలో చేరుపోనివారు లేరు. మల్లె చెండులా .. గులాబీ గుత్తిలా కనిపించే ఈ అమ్మాయిని చూసిన కుర్రాళ్లకి ఇంతకీ మించిన సౌందర్యం ఏముంటుంది? అనిపించడం సహజం. ఈ సొట్ట బుగ్గల సుందరి సినిమాలు త్వరలో వరుసగా థియేటర్లకు రానున్నాయి. కానీ ఆ గ్యాప్ ను తట్టుకోలేక ఎంతోమంది కుర్రాళ్లు తల్లడిల్లిపోతున్నారు.

‘ఉప్పెన’ సినిమా చూసిన తరువాత అందంలో నుంచి .. ఆకర్షణలో నుంచి కూడా ‘ఉప్పెన’ పుట్టుకొస్తుందా? అనే డౌట్ లోనే ఇంకా కుర్రాళ్లంతా ఉన్నారు. అంతగా ఆ సినిమాతో తన ప్రభావం చూపించిన కృతి శెట్టి ఆ స్థాయిలోనే మరోసారి కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టే మరో పాత్ర చేస్తోందట .. ఆ సినిమా పేరే ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమాలో రాజకీయాలు .. ఎన్నికలు .. గొడవలు ఉంటాయనే విషయం టైటిల్ ను బట్టే అర్థమైపోతోంది. కాకపోతే ఇవన్నీ కూడా ప్రేమ చుట్టూ అల్లుకునే కనిపిస్తాయట .. అదీ విషయం.

నితిన్ హీరోగా ఎస్.ఆర్.శేఖర్ దర్శకత్వంలో ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా రూపొందుతోంది. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. కలెక్టర్ గా నితిన్ .. ఒక సాధారణ ఉద్యోగిగా కృతి కనిపిస్తారట. ఈ సినిమాలో కథానాయికగా కథను కీలకమైన మలుపు తిప్పే పాత్రలో కృతి శెట్టి నటన ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. ఒక కీలకమైన సమయంలో వచ్చే ఆమె ఎపిసోడ్ .. ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ గురించి ప్రేక్షకులు చాలా రోజుల పాటు మాట్లాడుకునేదిలా ఉంటుందట. ఈ సినిమాతో ఆమె పేరు మరోసారి మారుమ్రోగిపోవడం ఖాయమని అంటున్నారు.

ఒక కలెక్టర్ కీ .. ఒక సాధారణమైన ఉద్యోగికి మధ్య పరిచయం ఎలా జరిగింది? వాళ్ల పరిచయం ఎలా ప్రేమగా మారింది? ప్రేమలో పడిన తరువాత వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది? వాళ్ల ప్రేమకీ .. మాచర్ల నియోజకవర్గానికి మధ్య సంబంధం ఏమిటి? అనే అంశాలు కీలకమైన మలుపులుగా కనిపిస్తాయని అంటున్నారు. వచ్చే ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం కృతి నుంచి రావడానికి ‘శ్యామ్ సింగ రాయ్’ .. ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ .. ‘బంగార్రాజు’ .. రామ్ సినిమాలు సిద్ధమవుతున్నాయి.


Advertisement

Recent Random Post:

Andhra Pradesh : వరుస సమావేశాలతో బిజీ బిజీగా డిప్యూటీ సీఎం

Posted : June 28, 2024 at 1:11 pm IST by ManaTeluguMovies

Andhra Pradesh : వరుస సమావేశాలతో బిజీ బిజీగా డిప్యూటీ సీఎం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement