Advertisement

బేబమ్మ డ్రీమ్ రోల్‌ ఏంటో తెలుసా?

Posted : May 1, 2022 at 5:49 pm IST by ManaTeluguMovies

ఉప్పెన సినిమాతో చిన్నవయసులోనే హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్గా దూసుకు వెళ్తుంది. ఇప్పటి వరకు ఆమె నటించిన మూడు విడుదలవ్వగా ఆ మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరగడం జరిగింది. ఒక సినిమాకు కోటికి పైగా పారితోషికం దక్కించుకుంటున్న హీరోయిన్ల జాబితాలో బేబమ్మ చేరిపోయింది.

సినిమాల్లో ఆఫర్ రాకముందు ఏదో ఒక సినిమా.. ఏదో ఒక అవకాశం అన్నట్లుగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. సినిమాల్లో ఎప్పుడైతే బిజీ అవుతారో అప్పుడు డ్రీం రోల్స్ అంటూ మాట్లాడతారు. కృతి శెట్టికి కూడా డ్రీమ్ రోల్ ఉందట. అది ఏంటంటే.. ఏదైనా సినిమాలో రాజకుమారి పాత్రలో నటించాలనేది ఆమె కోరిక. బాహుబలి లో అనుష్క మాదిరిగా ఒక పవర్ఫుల్ రాజకుమారి పాత్రలో కనిపించాలని కృతి శెట్టి ఆశపడుతోంది. మరి ఈ అమ్మడి కోరిక నెరవేరేనా.. రాజకుమారిగా ఈ బేబమ్మ మారేనా అనేది తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.


Advertisement

Recent Random Post:

Jabardasth Latest Promo – 23rd May 2024 – Indraja,Siri Hanmanth,Rocket Raghava,Saddam,Indraja

Posted : May 22, 2024 at 2:29 pm IST by ManaTeluguMovies

Jabardasth Latest Promo – 23rd May 2024 – Indraja,Siri Hanmanth,Rocket Raghava,Saddam,Indraja

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement