Advertisement

గాజులు ఘల్లుమన్నవే

Posted : September 22, 2020 at 8:50 pm IST by ManaTeluguMovies

పంజా వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించాయి. సోమవారం కృతీ శెట్టి బర్త్‌డే సందర్భంగా ‘క్యూటెస్ట్‌ అండ్‌ నేచురల్‌ యాక్ట్రెస్‌ కృతీ శెట్టికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. చేతులకు గాజులు వేసుకుంటూ అపురూపంగా వాటిని చూసుకుంటోన్న ఆమె లుక్‌ ఆకట్టుకుంటోంది.

‘‘ఉప్పెన’ చిత్రంలో వైష్ణవ్‌ తేజ్, కృతి మధ్య కెమిస్ట్రీ ముచ్చటగా అనిపిస్తోంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు సంగీతప్రియులను అలరిస్తూ టాక్‌ ఆఫ్‌ ద టౌ¯Œ గా మారాయి. ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ సహా అన్ని పనులూ పూర్తయ్యాయి. సానుకూల పరిస్థితులు ఏర్పడి, థియేటర్లు తెరుచుకోగానే సినిమాని విడుదల చేయడానికి సన్నద్ధంగా ఉన్నాం’’ అని నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ పేర్కొన్నారు.


Advertisement

Recent Random Post:

‘తూర్పు’న ఈస్ట్ ఆర్ వెస్ట్.. జగన్ ఓన్లీ బెస్ట్ నినాదం | CM YS Jagan Bus Yatra | AP Elections 2024

Posted : April 20, 2024 at 5:12 pm IST by ManaTeluguMovies

‘తూర్పు’న ఈస్ట్ ఆర్ వెస్ట్.. జగన్ ఓన్లీ బెస్ట్ నినాదం | CM YS Jagan Bus Yatra | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement