బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రస్తుతం సజావుగా సాగుతోంది. యాజమాన్యం ఊహించిన దానికంటే రేటింగ్స్ బాగున్నాయి. వివిధ కారణాల వల్ల ఈసారి బిగ్ బాస్ కు చాలా తక్కువ రేటింగ్స్ ను ఊహించారు యాజమాన్యం. అందులో మొదటిది కరోనా వైరస్ ప్రభావం. కరోనా కారణంగా షో లేట్ గా మొదలైంది. అలాగే కరోనా కావడంతో పేరున్న సెలబ్రిటీలు హౌస్ లోకి ఎంటరవ్వడానికి నిరాకరించారు. దీంతో పెద్దగా పేరు లేని వారు హౌస్ లోకి ఎంటరయ్యారు.
బిగ్ బాస్ అనేది బిగ్గెస్ట్ రియాలిటీ షో కావడంతో పారితోషికాలు కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయని అందరూ అనుకుంటారు. అయితే అంత సీన్ అయితే లేదని అంటున్నాడు కుమార్ సాయి. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు కుమార్ సాయి. కమెడియన్ కావడంతో హౌస్ లో ఫన్ పండిస్తాడని ఊహించినా కుమార్ సాయి హౌస్ లో ఉన్నన్ని రోజులు ఒకటీ అరా టాస్కులు తప్పితే పెద్దగా చేసిందేం లేదు. దీంతో కొన్ని వారాలకే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
ఇక హౌస్ లోంచి బయటకు వచ్చాక కుమార్ సాయి వివిధ ఇంటర్వ్యూలు ఇవ్వగా అందులో ప్రధానంగా రెమ్యునరేషన్ టాపిక్ గా మారింది. అయితే అందరూ అనుకుంటున్నట్లు తనకు లక్షలకు లక్షలు పారితోషికం ఏమీ ముట్టజెప్పలేదని తాను సినిమాలకు తీసుకునే దానికంటే కొంత ఎక్కువ ఇచ్చారని అన్నాడు కుమార్ సాయి. దీని ప్రకారం కుమార్ సాయికి రోజుకు 25వేల దాకా చెల్లించి ఉండవచ్చని భావిస్తున్నారు.