Advertisement

జిల్లనిపించే లావణ్యంపై అందుకే రూమర్లు!

Posted : January 26, 2022 at 12:42 pm IST by ManaTeluguMovies

అందానికి అందం జిల్లనిపించే స్పీడ్ తనలో ఉన్నాయి కాబట్టే నిరంతరం గాసిప్స్ షికార్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ బ్యూటీ మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉందంటూ ప్రచారం సాగుతోంది. అయితే దీనికి షాకింగ్ రిప్లయ్ ఇచ్చి నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది లావణ్యం. ఇక పనిలో పనిగా తన దృష్టి ప్రస్తుతానికి సినీకెరీర్ పైనే ఉందని కూడా క్లారిటీనిచ్చేసింది. వరుసగా సినిమాలు చేసేందుకు కథలు వింటోందిట. పనిలో పనిగా ఇలా ఫోటోషూట్లతోనూ ఎప్పటికప్పుడు యూత్ ని ఆకర్షిస్తోంది. ఐదున్నర అడుగుల లావణ్యం అందానికి ఫిదా కానిది ఎవరు? అంటూ ఈ ఫ్రాక్ లుక్ చూసి ఫిదా అయిపోతోంది యూత్.

పెళ్లి పుకార్లకు అలా చెక్:

లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లాడేయబోతోందని అందుకు టాలీవుడ్ యువహీరో రెడీగా ఉన్నారని గుసగుసలు వైరల్ అయ్యాయి. అయితే తన పెళ్లి పుకార్లపై లావణ్య పూర్తి క్లారిటీనిచ్చింది. సూటిగా కాదు కానీ.. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్తో లావణ్య పెళ్లి జరగబోతోందని కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. జనవరి 19న వరుణ్ తేజ్ 32వ పుట్టినరోజుకు ప్రత్యేక అతిథిగా లావణ్య హాజరైన తర్వాత ఈ పుకార్లు ఊపందుకున్నాయి. లావణ్య కూడా వరుణ్ నివాసంలో జరిగిన బర్త్ డే పార్టీలో వరుణ్ తో సన్నిహితంగా కలిసి ఉండడం సందేహాలకు తావిచ్చింది.

అయితే లావణ్య ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తాజా పోస్ట్ తో పుకార్లను కొట్టిపారేసింది. ఎక్కువ వివరణలేవీ ఇవ్వకుండా.. లావణ్య డెహ్రాడూన్ లోని తన నివాసం నుండి కొన్ని ఫోటోలను బయట పెట్టింది. తాను కొన్ని మైళ్ల దూరంలోని తన ఇంట్లో ఆ రోజు ఉన్నానని హింట్ ఇచ్చింది. పుకార్లపై పరోక్షంగా స్పందిస్తూ.. లావణ్య తన కుటుంబంతో కలిసి డెహ్రాడూన్ లోని తన స్వస్థలంలో ఉన్నానని చెబుతూ ఈ ఫోటోలను పంచుకుంది. ఇంతకుముందు లావణ్య కూడా వరుణ్ సోదరి వివాహ వేడుకకు హాజరయ్యారు. కొన్ని వైరల్ ఫోటోల్లో ఆమె వరుణ్ కుటుంబ సభ్యులతో పోజులిచ్చింది.

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వెండితెరపై అద్భుతమైన కెమిస్ట్రీని ప్రదర్శించిన పెయిర్ గా పాపులరయ్యారు. మిస్టర్- అంతరిక్షం అనే రెండు చిత్రాలలో నటించారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. వరుణ్ తదుపరి గనీలో కనిపించనున్నాడు. ఇది బాక్సర్ కథ ఆధారంగా రూపొందుతోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. రెనైసాన్స్ పిక్చర్స్ – అల్లు బాబీ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది.


Advertisement

Recent Random Post:

బలరాం కుటుంబంపై ఆమంచి రివెంజ్ తీసుకున్నాడా..? | OTR

Posted : June 8, 2024 at 2:00 pm IST by ManaTeluguMovies

బలరాం కుటుంబంపై ఆమంచి రివెంజ్ తీసుకున్నాడా..? | OTR

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement