Advertisement

లాక్‌డౌన్‌ పొడిగిస్తారట.. ఐతే ఏంటట?

Posted : May 27, 2020 at 9:54 pm IST by ManaTeluguMovies

లాక్ డౌన్ అంటే వామ్మో అన్న వాళ్లంతా ఇప్పుడు ఆ మాటను లైట్ తీసుకుంటున్నారు. రెండో దశ లాక్ డౌన్ వరకు చాలా కఠినంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మూడో దశ నుంచి మినహాయింపులు మొదలుపెట్టాయి. నాలుగో దశలో చాలా వరకు షరతులన్నీ ఎత్తేశారు. బస్సులు, రైళ్లు, విమానాలు నడుస్తున్నాయి. దుకాణాలన్నీ తెరుచుకున్నాయి. థియేటర్లు, పెద్ద షాపింగ్ మాల్స్‌పై మాత్రమే ఆంక్షలున్నాయి.

రాజకీయ, మతపరమైన సభలు, సమావేశాలపైనా నిషేధం కొనసాగుతోంది. రాత్రి వేళల్లో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతోంది. దీని వల్ల జనాలకు పెద్దగా ఇబ్బందేమీ లేదు. కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న సమయంలో ఈ మినహాయింపులేంటి అన్న ప్రశ్నలు వస్తున్నప్పటికీ.. ఇంతకుమించి జనాల్ని కట్టడి చేస్తే చాలా కష్టమని భావించి ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చేశాయి.

కొన్ని పరిమితుల మధ్య నామమాత్రంగా నడుస్తున్న నాలుగో దశ లాక్ డౌన్ ఈ నెల 31తో ముగియనుంది. ఆ తర్వాత ఏంటి అన్నదానిపై స్పష్టత లేదు. ఇంతకుముందు లాక్ డౌన్ గడువు ముగుస్తుండగా.. అందరిలోనూ ఉత్కంఠగా ఉండేది. లాక్ డౌన్‌ను పొడిగిస్తారా.. ఏమైనా మినహాయింపులు ఇస్తారా అని చూసేవాళ్లు. ప్రధాని లేదంటే రాష్ట్ర సీఎం కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారని.. ఏదో ప్రకటన చేయబోతున్నారని అనగానే కౌంట్ డౌన్ మొదలైపోయేది. నిర్ణీత సమయానికి టీవీల ముందు వాలిపోయారు. కానీ ఇప్పుడు అలాంటి ఉత్కంఠ ఏమాత్రం లేదు.

లాక్ డౌన్ పొడిగింపు, మినహాయింపుల విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు సమావేశం నిర్వహించనున్నారట. తర్వాత ప్రెస్ మీట్ కూడా ఉండబోతోందట. లాక్ డౌన్‌ను మళ్లీ పొడిగిస్తారట.. ఇదీ తాజా మీడియా సమాచారం. ఐతే ఇప్పుడెలాగూ లాక్ డౌన్ నామమాత్రంగానే నడుస్తుండటంతో పొడిగించినా పోయేదేముంది అన్నట్లు జనాలు లైట్ తీసుకుంటున్నారు. మినహాయింపు విషయంలోనూ ఆసక్తి ఏమీ లేదు. గత ప్రెస్ మీట్లలో మాదిరి ఈసారి కేసీఆర్ ఏం చెబుతారా అని జనాలు టీవీల ముందు వాలిపోయే పరిస్థితి లేనట్లే.


Advertisement

Recent Random Post:

Rahul Gandhi Speech Highlights in Lok Sabha | Bullet Questions To BJP

Posted : July 2, 2024 at 12:15 pm IST by ManaTeluguMovies

Rahul Gandhi Speech Highlights in Lok Sabha | Bullet Questions To BJP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement