Advertisement

లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్ ఏంటి?

Posted : May 14, 2020 at 7:57 pm IST by ManaTeluguMovies

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ విధించిన దేశాలు ఇప్పుడు ఆకలి, ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవుతున్నాయి. లాక్ డౌన్ విధించి ఏడెనిమిది వారాలవుతున్నా కేసుల సంఖ్యలో తగ్గుదల లేదు. ఈ పరిస్థితి ఇంకెంత కాలం ఉంటోందో తెలియదు. మరోవైపు కరోనాకి మందు, వ్యాక్సిన్ రావడానికి ఇంకా సమయం పట్టనుంది. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎలా ఎత్తివేయాలా అని పలు దేశాలు ఆలోచిస్తున్నాయి.

ఎగ్జిట్ ప్లాన్ ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు చేస్తున్నాయి. దేశంలో లాక్ డౌన్ నాలుగో దశ కూడా కొనసాగుతుందని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. అయితే, గతానికి భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను 18వ తేదీ లోపు వెల్లడిస్తామన్నారు. దీంతో కొత్త నిబంధనలు ఎలా ఉంటాయనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనాతో కలసి సాగక తప్పదని ప్రధాని కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో అందుకు అనుగుణమైన మేరకే నాలుగో దశ లాక్ డౌన్ ఉంటుందని తెలుస్తోంది.

ఈ విషయంలో బ్రిటన్ మూడు దశల ఎగ్జిట్ ప్లాన్ రూపొందించింది. మే 13 నుంచి తొలి దశ, జూన్ 1 నుంచి రెండో దశ, జూలై 4 నుంచి మూడో దశ మొదలుకానుంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, ప్రతి ఒక్కరూ కనీసం రెండు మీటర్ల భౌతికదూరం పాటించాలని, ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించకుండా అందరూ సొంత వాహనాలనే వినియోగించాలని సూచనలు చేశారు.

అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఇక పబ్ లు, రెస్టారెంట్లను ఓపెన్ చేసే విషయంలో మూడో దశ ప్రారంభమయ్యే జూలై 4 తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. మనకంటే రెండు రోజుల ముందు లాక్ డౌన్ ప్రకటించిన బ్రిటన్ ఎగ్జిట్ ప్రణాళిక ఈ విధంగా ఉన్న నేపథ్యంలో మన దేశంలోనూ ఇదే తరహా విధానాలను అవలంభించే అవకాశం ఉంది.


Advertisement

Recent Random Post:

అఘోరీని చూస్తామంటూ క్యూ కట్టిన జనం | Huge Crowd For Watching Lady Aghori @ AP

Posted : November 5, 2024 at 5:47 pm IST by ManaTeluguMovies

అఘోరీని చూస్తామంటూ క్యూ కట్టిన జనం | Huge Crowd For Watching Lady Aghori @ AP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad