Advertisement

లవ్ స్టోరీ: ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పటినుండి?

Posted : October 11, 2021 at 6:10 pm IST by ManaTeluguMovies

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం లవ్ స్టోరీ. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్ర ప్రారంభ వసూళ్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మొదటి వారాంతానికే కలెక్షన్స్ ను కుమ్మేసిన ఈ చిత్రం యూఎస్ లో 1 మిలియన్ మార్క్ ను కూడా చేరుకుంది.

ఇక మూడో వారంలోకి కూడా అడుగుపెట్టిన లవ్ స్టోరీ ఇప్పటికే చాలా చోట్ల సేఫ్ వెంచర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే లవ్ స్టోరీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. దానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఆహాలో లవ్ స్టోరీ 22వ తేదీ నుండి స్ట్రీమ్ కానుంది. భారీ ధరకు డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది ఆహా.

ఇక స్టార్ మా సంస్థ సాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ నిర్మించారు. పవన్ సిహెచ్ అందించిన సంగీతం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


Advertisement

Recent Random Post:

Let’s share memories with a smile 😀 #BiggBossTelugu5 today at 10 PM

Posted : October 22, 2021 at 11:41 am IST by ManaTeluguMovies

Let’s share memories with a smile 😀 #BiggBossTelugu5 today at 10 PM

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement