Advertisement

‘ఆచార్య’లో మహేష్.. అసలు విషయం చెప్పిన కొరటాల

Posted : April 17, 2020 at 6:48 pm IST by ManaTeluguMovies

‘ఆచార్య’ సినిమాలో ప్రత్యేక అతిథి పాత్రకు సంబంధించి నెల రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముందు ఈ పాత్రకు రామ్ చరణ్ పేరు వినిపించింది. తర్వాతేమో మహేష్ పేరు తెరపైకి వచ్చింది. మహేష్ ఈ సినిమాలో నటించడం ఖాయమని వార్తలొచ్చాయి. తర్వాతేమో పారితోషకం విషయంలో మహేష్ డిమాండ్లు నచ్చక చిరు-చరణ్ వెనక్కి తగ్గారని.. చివరికి చరణే ఈ పాత్ర చేయడానికి రెడీ అయ్యాడని అన్నారు.

ఇంతలో చిరంజీవి లైన్లోకి వచ్చి మహేష్ ఈ సినిమాలో నటించే విషయంలో అసలు చర్చే జరగలేదని.. అతడి పేరు ఎలా తెరపైకి వచ్చిందో తెలియదని అన్నాడు. చివరికి ఆయనే చరణ్‌ ఈ పాత్ర చేస్తున్నట్లు.. ఇందుకు ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళి అనుమతి కూడా ఇచ్చినట్లు స్పష్టత ఇచ్చారు. ఇంతటితో ఈ వ్యవహారం ముగిసిందనే అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడేమో ‘ఆచార్య’ దర్శకుడు కొరటాల శివ కొంచెం భిన్నమైన వెర్షన్ వినిపించారు. ఈ సినిమాలో మహేష్ నటిస్తాడన్న ప్రచారం ఎలా జరిగిందో ఆయన వివరించారు. ముందు ఇందులో అతిథి పాత్ర కోసం చరణ్‌నే అనుకున్న మాట వాస్తవమే అని.. ఈ విషయం చిరంజీవికి చెబితే బాగుంటుందన్నారని చెప్పిన కొరటాల.. ఆ తర్వాత ఏమైందో వివరించాడు.

‘‘చరణ్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తుండటంతో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందామనుకున్నా. కానీ ఆ చిత్రం వాయిదా పడింది. ఈ లోగా మా ‘ఆచార్య’ విడుదల కూడా వచ్చే ఏడాదనే ప్రచారం మొదలైంది. దీంతో లోపల చిన్న టెన్షన్ మొదలైంది. ఈ హడావుడి మధ్య అనుకోకుండా మహేష్‌తో మాట్లాడా. మాటల మధ్యలో ‘సినిమా విడుదల ఎప్పుడు’ అని అడిగాడు. ‘అదే స్పష్టత రావడం లేదండీ’ అన్నా. నా టెన్షన్ గమనించి.. ‘మరీ ఇబ్బందికర పరిస్థితి వస్తే నేనున్నా’ అన్నారాయన. ఆ మాట విని షాకయ్యాను.

మహేష్ లాంటి హీరో ఆ మాట అన్నాక ఎంత ధైర్యం వస్తుంది. ఈ ఆనందంలో కొందరితో ఈ విషయాన్ని పంచుకున్నా. అది రకరకాలుగా ప్రచారమైంది. ఆయన గొప్ప మనసుతో, పాత్ర ఏంటో కూడా తెలియకుండా సరదాగా నేనున్నా అన్నారు’’ అంటూ అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చాడు కొరటాల.


Advertisement

Recent Random Post:

సీఎం రేవంత్ కారులో ఏమున్నాయి..? | CM Revanth Reddy vehicle checked by Maharashtra police

Posted : November 16, 2024 at 7:01 pm IST by ManaTeluguMovies

సీఎం రేవంత్ కారులో ఏమున్నాయి..? | CM Revanth Reddy vehicle checked by Maharashtra police

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad