Advertisement

మహేష్, త్రివిక్రమ్ సినిమాలో నందమూరి నటుడు

Posted : May 29, 2022 at 1:16 pm IST by ManaTeluguMovies

సూపర్ స్టార్ మహేష్ బాబు తన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాటతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. అదే ఉత్సాహంతో తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టడానికి సమయాత్తం అవుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.

ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తవగా రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే నెల నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నందమూరి నటుడు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హీరోగా ఫెయిల్ అయ్యి క్యారెక్టర్ నటుడుగా మంచి అవకాశాల కోసం చూస్తూన్న నందమూరి తారకరత్న ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

పూజ హెగ్డే ఈ చిత్రంలో కథనాయికగా నటించనుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం గురించి మరింత సమాచారం త్వరలోనే వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి.


Advertisement

Recent Random Post:

Chandrababu and Rajinikanth at Narendra Modi Swearing-In Ceremony

Posted : June 9, 2024 at 8:33 pm IST by ManaTeluguMovies

Chandrababu and Rajinikanth at Narendra Modi Swearing-In Ceremony

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement