సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తర్వాత మూడు నెలలైనా బ్రేక్ తీసుకుందామని డిసైడ్ అయ్యాడు. అయితే సరిలేరు విడుదలైన రెండు నెలలకే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ పడడం, ఆ బ్రేక్ అలా కంటిన్యూ అవుతూ ఆరు నెలలు దాటిపోవడం జరిగాయి. మహేష్ కెరీర్ లో ఇదే రెండో అతిపెద్ద బ్రేక్. ఖలేజాకు ముందు దాదాపు మూడేళ్లు మహేష్ బ్రేక్ తీసుకున్న విషయం తెల్సిందే.
ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చేయడానికి కమిటైన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా లేదు. కనీసం ఆగష్టు లేదంటే సెప్టెంబర్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సర్కారు వారి పాట పూర్తయ్యాక రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ కమిటైన విషయం తెల్సిందే.
అయితే సర్కారు వారి పాట పూర్తయ్యే సమయానికి, రాజమౌళి ఇంకా ఆర్ ఆర్ ఆర్ నుండి ఫ్రీ అవ్వకపోవచ్చు. దీంతో మహేష్ మరో సినిమా చేయాలా లేదా రాజమౌళి కోసం వెయిట్ చేయాలా అన్న మీమాంసలో ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కూడా డిలే అవ్వడంతో రాజమౌళికి ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేయడానికే ఏడాదికి పైగా సమయం పడుతుంది. దాని తర్వాత మహేష్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయడానికి మరికొంత సమయం కావాలి. అందుకే మహేష్ కు పిచ్చ క్లారిటీ వచ్చేసింది. సర్కారు వారి పాట పూర్తి చేసి మరో సినిమాను కూడా హ్యాపీగా చేసుకోవచ్చు మహేష్. ఆ తర్వాత రాజమౌళి సినిమాకు షిఫ్ట్ అయ్యి రెండేళ్లో, మూడేళ్లో డేట్స్ ఇచ్చేయాలి.