Advertisement

మహేష్ పుట్టినరోజుకు స్పెషల్ ట్రీట్ ఏం లేనట్లే!

Posted : July 21, 2020 at 11:16 pm IST by ManaTeluguMovies

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో హ్యాట్రిక్ ను పూర్తి చేసిన మహేష్ బాబు ఇప్పుడు తన తర్వాతి చిత్రాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్న విషయం తెల్సిందే. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రానికి కమిటయ్యాడు మహేష్. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన జరిగిన విషయం తెల్సిందే.

ముందు జులై నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెడదాం అనుకుంటున్నారు. అయితే మహేష్ అండ్ టీమ్ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కేసులు విపరీతంగా ఉన్న తరుణంలో పరిస్థితులు చక్కబడే వరకూ షూటింగ్ కు వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కాబట్టి ఎంత ఆలస్యమైనా నిర్మాతకు భారం ఉండదు. అక్టోబర్ లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆరోజు సర్కారు వారి పాట టీం నుండి ఏమైనా స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందేమోనని అనుకున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు షూటింగ్ కూడా మొదలుకాలేదు కాబట్టి ఏ విధమైన సర్ప్రైజ్ ఉండకపోవచ్చు. అయితే దర్శకుడు పరశురామ్ మాత్రం ఏదో ఒక అప్డేట్ ను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.


Advertisement

Recent Random Post:

Supreme Court Tough Questions to TDP Govt Lawyer | Tirumala Laddu Controversy |

Posted : September 30, 2024 at 7:55 pm IST by ManaTeluguMovies

Supreme Court Tough Questions to TDP Govt Lawyer | Tirumala Laddu Controversy |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad