Advertisement

మహేష్ సినిమాలో మరో హీరో

Posted : May 6, 2021 at 4:23 pm IST by ManaTeluguMovies

స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ క్యారక్టర్స్ కు చిన్న హీరోలను తీసుకోవటం ఆనవాయితీగా మారింది. రీసెంట్ గా అల వైకుంఠపురములో చిత్రంలో సుశాంత్ కనపడ్డారు. అదే విధంగా ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రంలోనూ మరో హీరోకు బెర్త్ ఖాళీ ఉందని సమాచారం. ఆ సెంకడ్ హీరో సుధీర్ బాబు అయ్యే అవకాసం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయిసే అసలు సెకండ్ హీరో అనేదే రూమర్ కావచ్చు..అప్పుడు ఆ రూమర్ కు నెక్ట్స్ లెవిల్ సుధీర్ బాబు అని కొందరు అంటున్నారు. అసలు నిజం ఏమిటన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సింది.

ఇక త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో ఇప్పటికే ‘అతడు ఖలేజా’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కబోతూండటంతో మార్కెట్లో క్రేజ్ క్రియేట్ అవుతోంది. కాకపోతే తొలి రెండు సినిమాలు మహేశ్ కి ఆశించిన స్థాయిలో హిట్ ని అందించలేక పోయాయి. కాకపోతే చిత్రంగా టీవీలలో మాత్రం సూపర్ హిట్ అనిపించుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కు మహేష్ ని దగ్గర చేయటంలో అతడు ప్రధాన పాత్ర వహించింది. ఇప్పుడు మహేశ్ తోపాటు త్రివిక్రమ్ కూడా సూపర్ ఫామ్ లో ఉండటంతో ఖచ్చితంగా ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే అవకాసం ఉందంటున్నారు. ‘ఖలేజా’ తర్వాత పదకొండు సంవత్సరాల గ్యాప్ తో మహేశ్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ తాజా సినిమాకు ‘పార్థు’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. నిజానికి పార్థు అనేది మహేష్త్రివిక్రమ్ కలయికలో వచ్చిన తొలి సినిమా ‘అతడు’లో మహేష్ పాత్ర పేరు. టీవీల్లో అనేక సార్లు ప్రసారం కావటంతో.. ఆడియన్స్ లో ఆ పేరు బలంగా నాటుకు పోయి ఉందని అందుకే ఆ పేరు అయితే ఈజీగా జనాల్లోకి వెళుతుందనే అభిప్రాయంతో ఉన్నాడు త్రివిక్రమ్ అని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ని మే 31న పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

Lok Sabha adjourned after uproar over Om Birla’s Emergency a dark chapter remark

Posted : June 26, 2024 at 5:40 pm IST by ManaTeluguMovies

Lok Sabha adjourned after uproar over Om Birla’s Emergency a dark chapter remark

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement