కలెక్షన్ కింగ్ మోహన బాబు నట వారసుడిగా తెలుగు తెరకి పరిచయమైన మంచు మనోజ్ పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మనోజ్ కేవలం హీరోగానే కాకుండా తన సినిమాల మ్యూజిక్ విషయంలో, పాటలు రాయడంలో, తన ఫైట్స్ తనే కంపోజ్ చేసుకోవడంలోనే కాకుండా పలు సినిమాలకి నిర్మాత బాధ్యతలు కూడా నిర్వహించాడు. అలాంటి మనోజ్ గత మూడేళ్ళుగా సినిమాలకి గ్యాప్ తీసుకున్నారు.
ఇటీవలే బ్యాక్ టు మూవీస్ అంటూ తన తదుపరి సినిమా ‘అహం బ్రహ్మాస్మి’ని అమౌంస్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో మనోజ్ 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాకి ఎన్నడూ లేనంతగా భారీ బడ్జెట్ ని పెడుతున్నారు. టైటిల్ ని బట్టి చూస్తే ఇదొక ఆధ్యాత్మిక సినిమాలా ఉందనుకుంటే మాత్రం మనం మోసపోయినట్టేనట..
‘పూర్తి ఎనర్జిటిక్ గా ఈ సినిమా ఉంటుంది. ఎప్పుడైతే మనలో ఆధ్యాత్మికత ఉంటుందో అప్పుడే ఎనర్జీ వస్తుంది. భిన్న కాలాల్లో ఒక మనిషిలో కలిగే భావాలకి దృశ్య రూపమే అహం బ్రహ్మాస్మి. ఎన్నడూ లేనంతగా ఈ సినిమా కోసం 50 రోజులు కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే కేటాయించాము. అందులోనూ ఒకే ఒక్క ఫైట్ కోసం 6 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అలా అని ఇందులో ఏమీ కత్తులు, కటార్లు, ప్రాపర్టీస్ ఉండవు.. కేవలం చేతుల్తో మనుషుల్ని కొడతాడు. కానీ థియేటర్ లో అందరికీ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ ఫైట్స్ కోసం మొదటి సారి పీటర్ హెయిన్స్ తో కలిసి పని చేస్తున్నానని’ మంచు మనోజ్ తెలిపారు.