Advertisement

జోబిడెన్ డిజిటల్ క్యాంపెయిన్ ఛీఫ్ గా భారతీయ యువతి

Posted : July 1, 2020 at 7:47 pm IST by ManaTeluguMovies

ప్రపంచంలో కీలక పరిణామాలు భారతీయులు గాని భారతీయ సంతతి కానీ లేకుండా జరగడం లేదు. మనవాళ్లు అంతగా ప్రపంచ వ్యాప్తంగా పాతుకుపోయారు. తాజాగా అమెరికా అధ్యక్ష పదవికి మరో నాలుగు నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో కరోనా పాండెమిక్ మధ్యనే ఎన్నికల వేడి మొదలైంది. అక్కడ ప్రధానంగా పోటీ పడేది గెలిచేది రెండు పార్టీల అభ్యర్థులే. రిపబ్లికన్స్, డెమొక్రాట్స్. ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిగా మరోసారి ఎన్నికల్లో నిలబడుతుండగా… జో బిడెన్ డెమొక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో పబ్లిసిటీ ఊపందుకుంది. జో బిడెన్ ప్రచార బృందంలో అమెరికన్ ఇండియన్ అయిన మేథారాజ్ కు కీలక పదవి కట్టబెట్టారు జో బిడెన్. ఆమెను తన క్యాంపెయిన్ డిజిటల్ ఛీఫ్ గా నియమించారు జోబిడెన్. డిప్యూటీ డిజిటల్ ఛీఫ్ గా హిల్లరీ క్లింటన్ కోసం పనిచేసిన క్లార్క్ హంఫరీ నియమితులయ్యారు.

ప్రపంచంలో కరోనా తీవ్రంగా దేశం అమెరికానే. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఇపుడు డిజిటల్ ప్రెజెన్సే అత్యంత కీలకం. ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించడం అమెరికాలో కూడా నిషేధం. ఈ నేపథ్యంలో ఫండ్ రైజింగ్, పబ్లిసిటీ అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితి డిజిటల్ ఛీఫ్ పదవి ఇండియన్ అమెరికన్ మహిళ మేథారాజ్ కు దక్కడం ఇండియన్స్ కి, ఎన్నారైలకు ప్రౌడ్ మూమెంట్.

జో బిడెన్ గెలవడం దేశానికి ఎంత అవసరం అన్న విషయాన్ని జనం విశ్వసించేలా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఇపుడు మేథా రాజ్ పై ఉంది. జో బిడెన్ ఆలోచనలు, మేనిఫెస్టోను వీలైనంత ఎక్కువ మంది విశ్వసనీయతతో చేరవేయడం మేథారాజ్ ప్రధాన కర్తవ్యం ఇపుడు. అన్ని డిజిటల్ వేదికలను ఒక తాటిపైకి తెచ్చి సమన్వయం చేసుకోవడం, అది కూడా 130 రోజుల్లోనే ఇదంతా జరగాలి.

ఈ వ్యవహారంపై మేథా రాజ్ స్పందిస్తూ…. జో బిడెన్ ఎన్నికల క్యాంపెయిన్ లో డిజిటల్ చీఫ్ గా బాధ్యతలు అందుకున్నాను, నాకిక 130 రోజులే సమయం ఉంది. ఒక్క నిమిషం కూడా వృథా చేయలేను అంటూ తన లింక్డ్ ఇన్ అక్కౌంట్లో పేర్కొన్నారు.

మేధా రాజ్ జార్జ్ టౌన్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేశారు. అంతకు మునుపు ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.


Advertisement

Recent Random Post:

ఏపీ రూపురేఖలు మార్చిన నవరత్నాలు | CM YS Jagan | AP ELECTIONS 2024

Posted : May 2, 2024 at 2:05 pm IST by ManaTeluguMovies

ఏపీ రూపురేఖలు మార్చిన నవరత్నాలు | CM YS Jagan | AP ELECTIONS 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement