Advertisement

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తగ్గని ‘మీనా’ జోరు..

Posted : May 7, 2021 at 8:26 pm IST by ManaTeluguMovies

బాలనటిగా ఎంట్రీ ఇచ్చి.. తొంభై దశకంలో టాలీవుడ్, కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన హీరోయిన్లలో మీనా ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, వెంకటేశ్.. ఇలా అందరితో నటించి సక్సెస్ ఫుల్ నటి అనిపించుకున్నారు.ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇప్పుడు కూడా ఆమె వరుస సినిమాలు చేస్తూ బిజీగానే ఉంటున్నారు. దృశ్యం సినిమా ఆమెకు మంచి గుర్తింపు ఇచ్చింది.

వెంకటేశ్ – మీనా కలిసి చేసిన చంటి, అబ్బాయిగారు, సుందరకాండ, సూర్యవంశం సినిమాలన్నీ హిట్లే. రీఎంట్రీ తర్వాత చేసిన దృశ్యం కూడా సూపర్ హిట్టే. ఇప్పుడు దృశ్యం2 సినిమాలో కూడా కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దీంతోపాటు మీనా తమిళంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తే సినిమాలో కూడా నటిస్తున్నారు. దీంతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బిజీగా రాణిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Brother – Teaser | Jayam Ravi | Priyanka Arul Mohan | Harris Jayaraj | Rajesh M | Screen Scene

Posted : September 21, 2024 at 8:49 pm IST by ManaTeluguMovies

Brother – Teaser | Jayam Ravi | Priyanka Arul Mohan | Harris Jayaraj | Rajesh M | Screen Scene

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad