చిరంజీవి తనంతట తానుగా పూనుకుని, చిత్ర పరిశ్రమలోని రోజువారీ వేతనాలు తీసుకునే కార్మికులు, పేద కళాకారుల కోసం ఒక చారిటీ సంస్థని ఏర్పాటు చేస్తే అది చిరంజీవి సొంత సంస్థ అనే విధంగా చిత్రీకరించడం, కరోనా చారిటీ ట్రస్ట్ ని కాస్త చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనడం ఆయనకి మనస్తాపం కలిగిస్తోందట.
నిన్నటికి నిన్న రాజశేఖర్ కుమార్తెలు సీసీసీ కి రెండు లక్షలు ఇస్తే, చిరంజీవి సంస్థకి రాజశేఖర్ కుమార్తెల విరాళం అంటూ వెబ్సైటులో పేర్కొన్నారు. సీసీసీ కోసం చేసిన పాటలో నాగార్జున మినహా ముగ్గురు మెగా హీరోలే ఉండడం, చిరంజీవికి సన్నిహితులైన మెహర్ రమేష్ లాంటి వాళ్ళు ఈ చారిటీ ద్వారా లబ్ధిదారులకు అన్నీ అందజేయడం లాంటివి చిత్ర పరిశ్రమలోనే కొందరికి నచ్చడం లేదట.
అయితే బయటపడితే అనవసరంగా రచ్చ చేసినట్టు ఉంటుందని, సైలెంట్ గా తమకి తెలిసిన మీడియా ద్వారా ఇలా అక్కసు వ్యక్తం చేస్తున్నారట.