Advertisement

బీచ్ లో మెహ్రీన్ జోష్.. గతం గతః అంతేగా!

Posted : July 11, 2021 at 8:34 pm IST by ManaTeluguMovies

ప్రేమ ..పెళ్లి బంధాల నుంచి బయట పడటం అంత వీజీ కాదు. మనోవేదనకు గురి కాక తప్పదు. అయితే నిశ్చితార్థం అయ్యి ఆ తర్వాత ముగిసిపోయిన వివాహాల విషయంలో కొంతవరకూ గతం వెంటాడుతుంది. ఎంత ప్రయత్నించినా మనసుని వెంటాడే విషయాలుంటాయి.

ఇలాంటి రిలేషన్స్ విషయంలో ఎంతటి వారైనా గుండె నిబ్బరంతో ఎదుర్కోవాల్సిందే. అయితే మోడ్రన్ డేస్ రిలేషన్ షిప్స్ పూర్తి వేరుగా ఉన్నాయి. ఇటీవలే వివాహం రద్దు చేసుకుని నిశ్చింతగా మారిపోయిన మెహ్రీన్ లైఫ్ మ్యాటర్ తెలిసినదే. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు బిష్ణోయ్ కి నిశ్చితార్ధం అనంతరం మెహ్రీన్ బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఇరువురు మధ్య బంధం కొనసాగడం కష్టమని భావించి విడిపోయారు. నాటి నుంచి మెహరీన్ ఎంత మాత్రం గతాన్ని తలుచుకోకుండా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. మెహరీన్ బీచ్ లో చిలౌట్ అవుతోన్న కొత్త ఫోటోలను ఇన్ స్టా వేదికగా పంచుకుని తానెంతో సంతోషంగా ఉందో చెప్పకనే చెప్పింది. సాగర తీరం ఇసుకలో నీటి జాడల్లో పరుగులు తీస్తూ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం మెహరీన్ ఎఫ్-3లో నటిస్తోంది. అలాగే మారుతి-సంతోష్ శోభన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రంలోను నటించేందుకు సంతకం చేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ కానుంది.


Advertisement

Recent Random Post:

ఆడపిల్లలను రే*ప్ చేస్తుంటే కులం ఎందుకు వస్తుంది – Pawan Kalyan Sensational Comments

Posted : November 4, 2024 at 7:06 pm IST by ManaTeluguMovies

ఆడపిల్లలను రే*ప్ చేస్తుంటే కులం ఎందుకు వస్తుంది – Pawan Kalyan Sensational Comments

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad