Advertisement

మోడీ గారు… మీకర్థమవుతోందా?

Posted : May 10, 2020 at 10:44 pm IST by ManaTeluguMovies

కరోనా కట్టడి కోసం భారత్ తో సహా పలు దేశాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తోన్న సంగతి తెలసిిందే. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో లాక్ డౌన్ 4.0 తప్పదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే విధించిన మూడు లాక్ డౌన్ ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఘోరంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు వారిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను ఎత్తివేయాలని సూచిస్తున్నారు. మే 17తో లాక్ డౌన్ 3.0 గడువు ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ రేపు భేటీ కానున్నారు.

లాక్ డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి…లాక్ డౌన్ ఎత్తివేయాలా…. కొనసాగించాలా అన్న అంశాలపై సీఎంలతో మోడీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. వలస కూలీల తరలింపు, రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించడం వంటి అంశాలను కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.లాక్ డౌన్ విధించిన తర్వాత సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఐదోసారి.

ప్రతిసారి సీఎంల సలహాలు తీసుకునే మోడీ…వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రుల మాట మోడీ వినడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. గత వీడియో కాన్ఫరెన్స్ ల అనుభవాలను బట్టి సీఎంల మాట మోడీ వినడం లేదనిపిస్తోంది.

వలస కూలీల విషయంలో సీఎంలు చాలా సార్లు మొరపెట్టుకున్న తర్వాతే మోడీ ఓ నిర్ణయం తీసుకున్నారు. 40 రోజుల నరకయాతన అనుభవించిన తర్వాత వలస కూలీలకు మోక్షం లభించింది. అది కూడా వలస కూలీల విషయం అంతర్జాతీయంగా హైలైట్ అయింది. దీంతో, మోడీపై విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల తర్వాతే మోడీ స్పందించారన్న విమర్శలు వస్తున్నాయి.

వలస కార్మికుల విషయంలో మోడీ వ్యవహార శైలి వల్ల… ప్రపంచ వ్యాప్తంగా మోడీ ప్రతిష్ట మసక బారిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు, ఢిల్లీ-మర్కజ్ కాంటాక్టులు పట్టుకోవడంలో విఫలం కావడం….టెక్నాలజీ వాడటంలో విఫలం కావడం వంటివి మోడీకి ప్రతికూలంగా మారాయి. లాక్ డౌన్ సరైన సమయానికి విధించినా… అంతర్జాతీయ విమానాల విషయంలో మోడీ విఫలమయ్యారన్న వాదన వినిపిస్తోంది.

కేరళలో కేసులు నమోదవుతున్న సమయంలో..వుహాన్ నుంచి మెడికోలను క్వారంటైన్ లో పెట్టిన సమయంలోనే అంతర్జాతీయ విమానాలను ఆపి ఉంటే…కేసుల తీవ్రత ఇంత ఉండేది కాదన్న వాదన ఉంది. మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహానికి కారణం కూడా అదేనన్న ప్రచారం జరుగుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అంతర్జాతీయ విమానాలను నిలిపివేయకుండా, లాక్ డౌన్ ల మీద లాక్ డౌన్ లు విధించడం వల్ల రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయన్నది సీఎంల వాదన. మరి, ఈ సారైనా సీఎంల మొరను మోడీ సాబ్ ఆలకిస్తారో లేదో చూడాలి.


Advertisement

Recent Random Post:

Thug Life Release Date Teaser (Telugu) | Kamal Haasan | Mani Ratnam | STR | AR Rahman | RKFI| MT |RG

Posted : November 7, 2024 at 2:25 pm IST by ManaTeluguMovies

Thug Life Release Date Teaser (Telugu) | Kamal Haasan | Mani Ratnam | STR | AR Rahman | RKFI| MT |RG

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad