ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుతం కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం నేపథ్యంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. దీనిపై దేశ ప్రధాని మోదీ స్పందించారు. ఈమేరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ధైర్యం చెప్పారు. ఇద్దరు సీఎంలతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలను కేంద్రం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..
‘తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వర్షాలపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ‘భారీ వర్షాల వల్ల ఉత్పన్నమయిన పరిస్థితిని ఉద్దేశించి నేను తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ గారితో మాట్లాడాను. వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇవ్వబడింది. వర్ష బాధితుల క్షేమం కొరకై ప్రార్ధిస్తున్నాను’ అంటూ తెలుగులోనే స్పందించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ముఖ్యంగా హైదరాబాద్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. మహానగరం మునకలో ఉంది. ఎన్నడూ లేనంత వర్షాలు కురవడం.. నగరం జలమయం కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు.. ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం నిన్న కాకినాడ వద్ద తీరం దాటింది. ఈ ప్రభావం విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలపై తీవ్రంగా పడింది. ఉభయగోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట మునక, తీర ప్రాంతాల్లో సముద్ర తీరం కోతకు గురయ్యి తీవ్ర నష్టం వాటిల్లింది.
భారీ వర్షాల వల్ల ఉత్పన్నమయిన పరిస్థితిని ఉద్దేశించి నేను @TelanganaCMO KCR గారితో, @AndhraPradeshCM @ysjagan గారితో మాట్లాడాను.
వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇవ్వబడింది.
వర్ష బాధితుల క్షేమం కొరకై ప్రార్ధిస్తున్నాను.— Narendra Modi (@narendramodi) October 14, 2020