Advertisement

బ్రేకింగ్: మోహన్‌బాబు ఇంట్లోకెళ్ళి కుటుంబసభ్యులను బెదిరించిన దుండగులు

Posted : August 1, 2020 at 11:15 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్‌బాబు ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో హల్ చల్ చేశారు. నేరుగా మోహన్‌బాబు ఇంట్లోకి ఓ గుర్తుతెలియని కారు దూసుకెళ్ళడం కలకలం రేపింది. మిమ్మల్ని వదలమంటూ కొందరు దుండగులు హెచ్చరించడంతో భయానికి లోనైన మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఏపీ 31 ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లుగా సమాచారం. అయితే ఆ కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ ఘటన జరిగినప్పుడు మోహన్‌బాబు ఇంటి వాచ్‌మెన్ అప్రమత్తంగా లేనట్లు తెలుస్తోంది. మోహన్‌బాబు ఇంటికెళ్లి వార్నింగ్ ఇచ్చిన వ్యక్తులపై పోలీసులు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇక దీనిపైన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


Advertisement

Recent Random Post:

ఏపీలో హీరో ఎవరో, విలన్‌ ఎవరో ప్రజలు తెలుసుకోవాలి : CM YS Jagan | Memantha Siddham

Posted : April 24, 2024 at 8:28 pm IST by ManaTeluguMovies

ఏపీలో హీరో ఎవరో, విలన్‌ ఎవరో ప్రజలు తెలుసుకోవాలి : CM YS Jagan | Memantha Siddham

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement