హైదరాబాద్ లో ఇష్టానుసారంగా ప్లెక్సీలు ఏర్పాటు చేయకుండా జీహెచ్‌ఎంసీ కఠిన నియమ నిబంధనలు అమలు చేస్తుంది. అందులో భాగంగా మంచు ఫ్యామిలీ వారు ఏర్పాటు చేసిన తమ సినిమాలకు సంబంధించిన భారీ లైటింగ్ హోర్డింగ్ కు జీహెచ్‌ఎంసీ ఏకంగా లక్ష రూపాయల ఫైన్ ను విధించింది. ముందస్తు అనుమతులు తీసుకోకుండా ప్లెక్సీని ఏర్పాటు చేసినందుకు గాను ఈ ఫైన్ ను విధిస్తున్నట్లుగా అధికారులు చెప్పుకొచ్చారు.
మంచు మోహన్ బాబు ఇంటి ముందు ప్రస్తుతం మంచు హీరోలు నటిస్తున్న సినిమాలు అంతకు ముందు నటించిన సినిమాలతో ఒక భారీ హోర్డింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్ ఈ డీ లైటింగ్ తో కూడిన ఆ హోర్డింగ్ రూల్స్ కు విరుద్దంగా ఉంది అంటూ జీహెచ్ ఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చారు. లక్ష రూపాయల జరిమానా చెల్లించకుంటే త్వరలోనే కఠిన చర్యలకు దిగే అవకాశం ఉందట.