తెలుగు ఓటీటీ ఆహా కంటెంట్ విషయంలో భారీతనంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలను వరుసగా తీసుకుంటున్న ఆహా వారు ఇప్పుడు బాలకృష్ణతో భారీ ఓటీటీ టాక్ షో ను ప్లాన్ చేశారు. అన్ స్టాపబుల్ అనే టైటిల్ తో ఆహా లో రాబోతున్న ఈ టాక్ షో అద్బుతమైన రేటింగ్ ను దక్కించుకుంటుందనే నమ్మకంతో ఆహా వారు ఉన్నారు. ఇక ఈ టాక్ షో మాత్రమే కాకుండా మరిన్ని షో లను ఆహా వారు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆహా లో మోహన్ బాబు కూడా కనిపించబోతున్నాడు.
మోహన్ బాబు తో ఒక భారీ వెబ్ సిరీస్ ను ఆహా వారు ప్లాన్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మోహన్ బాబులో ఒక మంచి టాక్ షో ను ఆహా ప్లాన్ చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. వెబ్ సిరీస్ లేదా టాక్ షో ఏదో ఒకటి.. ఏదో ఒకలా ఖచ్చితంగా బాలయ్య తరహాలోనే మోహన్ బాబు కూడా ఆహా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ప్రస్తుతం సన్నాఫ్ ఇండియా అనే సినిమాను చేస్తున్న మోహన్ బాబు ముందు ముందు ఓటీటీ కంటెంట్ కు మోస్ట్ వాంటెడ్ ఆ మారుతాడేమో చూడాలి.