ముమైత్ ఖాన్ తన క్యాబ్ ను గోవాకు బుక్ చేసుకుందని అక్కడ ముందుగా అనుకున్న రోజుల కంటే ఎక్కువగా ఉందని తనకు అక్కడ ఉండేందుకు సరైన ఏర్పాట్లు చేయక పోవడంతో పాటు నన్ను భోజనం విషయంలో కూడా ఇబ్బంది పెట్టిందంటూ డ్రైవర్ రాజు మీడియా ముందు ఆమెపై ఆరోపణలు చేశాడు. కారులో సిగరెట్లు తాగుతూ చాలా ఇబ్బంది పెట్టిందని నాతో అసభ్యంగా మాట్లాడింది అంటూ రాజు పేర్కొన్నాడు. తనకు మొత్తం 15వేల రూపాయలు ముమైత్ ఖాన్ నుండి రావాల్సి ఉందని ఆమె నా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినట్లుగా పేర్కన్న డ్రైవర్ రాజు పోలీసులను ఆశ్రయించబోతున్నట్లుగా చెప్పాడు. డ్రైవర్ ఆరోపణలను ముమైత్ తిప్పికొట్టింది.
నిన్న ఆమె పంజాగుట్ట పోలీసు స్టేషన్ కు వెళ్లి రివర్స్ లో రాజుపై ఫిర్యాదు చేసింది. అతడు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. డబ్బులు ఇప్పటికే చెల్లించినా కూడా అదనంగా డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు అంటూ ఆరోపించింది. అతడి వల్ల తనకు ప్రాణ హాని ఉందని కూడా ముమైత్ ఫిర్యాదులో పేర్కొంది. ముమైత్ కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తామంటూ హామీ ఇచ్చారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ముమైత్.. అతడు తన గురించి అసత్య ప్రచారం చేస్తున్నాడంది. ఇప్పటికే క్యాబ్ మేనేజర్ కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశాను. పేదవాడు పోనీలే అని ఊరుకుంటే నన్ను బ్యాడ్ చేసేందుకు ప్రయత్నించాడు. నాపై చేసిన ఆరోపణలకు అతడిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ విషయమై రాజు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి. పోలీసులు రెండు వైపుల వాదనలు విన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.