Advertisement

ఈ లాక్ డౌన్ లో ఇస్మార్ట్ బ్యూటీ ఏం చేసింది?

Posted : June 19, 2020 at 7:45 pm IST by ManaTeluguMovies

నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఈమె పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. ఈ సినిమాతో అటు తనలోని నటనను, గ్లామర్ ను పూర్తి స్థాయిలో పండించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం నభా నటేష్ రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. సాయి తేజ్ హీరోగా సోలో బ్రతుకే సో బెటరు సినిమాలో నభా హీరోయిన్. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ లో కూడా ఈమెనే హీరోయిన్. ఈ రెండు సినిమాలు కూడా చిత్రీకరణ చివరి దశలో ఉన్నాయి. లాక్ డౌన్ లేకపోయి ఉండుంటే ఇప్పటికే రెండు చిత్రాలు కూడా విడుదలైపోయేవి.

ఈ మూడు నెలలు షూటింగ్ లు లేక లాక్ డౌన్ అమల్లో ఉండడంతో నభా తన సొంత రాష్ట్రమైన కర్ణాటకలో చిక్ మంగళూరులో తన కుటుంబ సభ్యులతో ఉంది. వారితోనే తన లాక్ డౌన్ సమయాన్ని గడిపేసింది. ఈ లాక్ డౌన్ ఏమేం చేసావు అంటే చాలా క్వాలిటీ సమయాన్ని గడిపాను అంటోంది.

షూటింగులు ఉన్నప్పుడు హైదరాబాద్ లో హోటల్స్ లో ఫుడ్ తిని బోర్ కొట్టిందని, ఇప్పుడు లాక్ డౌన్ లో హోమ్ ఫుడ్ తినడం బాగా నచ్చిందని, తాను కూడా వంట చేసి ఇంట్లో వాళ్లకు పెట్టానని చెప్పుకొచ్చింది. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లాక్ డౌన్ లో ఎక్కువ సమయాన్ని సినిమాలు చూసేందుకే కేటాయించానని, అలాగే తనకు చాలా ఇష్టమైన ల్యాండ్ స్కేప్ పెయింటింగ్స్ ను కూడా చాలా వేశానని చెప్పుకొచ్చింది.

ఇక షూటింగులు మొదలవ్వడం కోసం ఎదురుచూస్తున్నానని, ఎగ్జైటింగ్ కథల కోసం ఎదురుచూస్తున్నానని అంటోంది.


Advertisement

Recent Random Post:

Raa Macha Macha – Song Promo | Game Changer | Ram Charan | Shankar | Thaman S | Nakash Aziz

Posted : September 28, 2024 at 10:15 pm IST by ManaTeluguMovies

Raa Macha Macha – Song Promo | Game Changer | Ram Charan | Shankar | Thaman S | Nakash Aziz

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad