Advertisement

ఎన్టీఆర్‌ 30 లో ఇస్మార్ట్‌ బ్యూటీ?

Posted : April 22, 2021 at 12:55 pm IST by ManaTeluguMovies

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో అందంతో పాటు అభినయం విషయంలో కూడా వావ్‌ అనిపించిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. ఆ సినిమా కు ముందు నభా చాలా సినిమాల్లోనే నటించింది. కాని ఆశించిన స్థాయిలో గుర్తింపును దక్కించుకోలేక పోయింది. కాని తాజాగా ఇస్మార్ట్‌ శంకర్ కారణంగా వరుసగా ఆఫర్లు అయితే దక్కించుకుంటుంది. ఇప్పటికే మూడు నాలుగు సినిమాల్లో నటించిన నభా నటేష్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌ 30 సినిమా కు పరిశీలింపబడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న ఈ క్రేజీ కాంబోలో ఒక హీరోయిన్‌ గా నభా నటేష్‌ ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. జూన్‌ లేదా జులై నుండి కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను ఎన్టీఆర్ మొదలు పెట్టబోతున్నాడు. అప్పటి వరకు ఎన్టీఆర్ హీరోయిన్‌ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ కు జోడీగా నభా నటేష్‌ నటిస్తే ఖచ్చితంగా ఆమె కెరీర్‌ టర్న్‌ అయినట్లే అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.


Advertisement

Recent Random Post:

నేను బచ్చానైతే నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావ్ Chandrababu..? – CM YS jagan | Punnur

Posted : April 29, 2024 at 6:05 pm IST by ManaTeluguMovies

నేను బచ్చానైతే నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావ్ Chandrababu..? – CM YS jagan | Punnur

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement