వైవిధ్యమైన సబ్జెక్ట్ లకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరక్టర్ విక్రమ్ కె కుమార్. అలాంటి డైరక్టర్ లేటెస్ట్ గా నాగ్ చైతన్యతో ఏం చేయబోతున్నాడు. పైగా ఆయన స్వంత కథ కాదు. బివిఎస్ రవి-దిల్ రాజు కలిపి ఏనాడో తయారుచేసిపెట్టుకున్న కథ. దానికి తన స్టయిల్ లోకి మార్చుకుంటున్నారు విక్రమ్ కె కుమార్.
ఈ లైన్ గురించి చిత్రమైన వార్తలు వినిపిస్తున్నాయి. శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం ఊపులో వున్నపుడు దిల్ రాజు ఆ సినిమాల దర్శకుడు సతీష్ వేగ్నిశతో చేయాలనుకున్న సబ్జెక్ట్ ఇది. అయితే శ్రీనివాస కళ్యాణం ఫలితం చూసి, వెనకడుగు వేసారు.
ఎవరైనా ఏం చిన్న సాయం చేసినా థాంక్స్ చెప్పాలి. అలా కృతజ్ఞత వ్యక్తం చేయడం అన్నది మనిషి కనీస కర్తవ్యం అన్నదాన్ని బాగా నమ్మే యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది అని తెలుస్తోంది. మరి ఈ టైపు కథను విక్రమ్ కే కుమార్ ఎలా డీల్ చేస్తారో? లేక ఇది వద్దు అని వేరే కథన ఏమైనా అల్లుతున్నారో చూడాలి.