Advertisement

వరసగా ఐదు ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టిన నాగ చైతన్య

Posted : February 19, 2022 at 10:20 pm IST by ManaTeluguMovies

అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరసగా లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో సూపర్ హిట్స్ సాధించాడు. ఇక రీసెంట్ గా థాంక్యూ చిత్ర షూటింగ్ ను కూడా పూర్తి చేసాడు నాగ చైతన్య.

ఇక థాంక్యూ తీసిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలోనే ఒక హారర్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. అమెజాన్ ప్రైమ్ ఈ సిరీస్ ను నిర్మిస్తోంది.

ఇక మరో మూడు చిత్రాలకు నాగ చైతన్య ఎస్ చెప్పినట్లు సమాచారం. నాంది తెరకెక్కించిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాగ చైతన్య ఒక చిత్రాన్ని చేయనున్నాడు. దాని తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలోనే మరో సినిమా చేయనున్నాడు.

అంతే కాకుండా కిషోర్ తిరుమల, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వాలలో కూడా రెండు చిత్రాలు లైన్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో వచ్చే రెండేళ్లు నాగ చైతన్య ఫుల్ బిజీగా ఉండనున్నాడు.


Advertisement

Recent Random Post:

Dhee Celebrity Special 2 Latest Promo – 20th June 2024 – Every Wed & Thu @9:30 PM – Nandu,Hansika

Posted : June 18, 2024 at 2:12 pm IST by ManaTeluguMovies

Dhee Celebrity Special 2 Latest Promo – 20th June 2024 – Every Wed & Thu @9:30 PM – Nandu,Hansika

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement