Advertisement

చైతూ లవ్‌ స్టోరీ బ్యాడ్‌ లక్‌

Posted : May 1, 2020 at 6:13 pm IST by ManaTeluguMovies

నాగచైతన్య కెరీర్‌ ఎప్పుడు లేనంత పాజిటివ్‌ బజ్‌తో ప్రస్తుతం ఉన్నాడు. గత ఏడాది వచ్చిన మజిలీ మరియు వెంకీ మామ చిత్రాలు సక్సెస్‌ అయ్యాయి. దాంతో వెంటనే మరో హిట్‌ను కొట్టాలని చైతూ ఆశ పడ్డాడు. శేఖర్‌ కమ్ములతో చేస్తున్న లవ్‌ స్టోరీ చిత్రం మరో విజయాన్ని తన ఖాతాలో వేయడం ఖాయం అనుకున్నాడు. ఫిదా తర్వాత శేఖర్‌ కమ్ముల చేస్తుండటంతో ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాను గత ఏడాది చివర్లోనే విడుదల అవ్వాల్సి ఉంది. కాని మేకింగ్‌ విషయంలో ఆలస్యం అవుతూ వచ్చింది. రిపబ్లిక్‌ డేకు అయినా విడుదల చేయాలనుకున్నారు. అది కూడా కుదరలేదు. ఇక ఫిబ్రవరి 14కు తప్పకుండా విడుదల చేస్తామని అన్నారు. కాని ఆ రోజు టీజర్‌తోనే సరిపెట్టారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్‌ కానుకగా ఏప్రిల్‌లో విడుదల చేయాలని శేఖర్‌ కమ్ముల అనుకున్నాడు. ఈసారి విడుదల చేసేవాడేమో. కాని కరోనా లాక్‌ డౌన్‌తో సినిమా వాయిదా పడినది.

లవ్‌ స్టోరీ చిత్రం షూటింగ్‌ 15 డేస్‌ బ్యాలన్స్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. అయితే సినిమాను మాత్రం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదని తెలుస్తోంది. శేఖర్‌ కమ్ముల సినిమాకు ఓవర్సీస్‌లో మంచి బిజినెస్‌ ఉంటుంది. కనుక అక్కడ ఇక్కడ అన్ని చోట్ల పరిస్థితులు కుదుటపడ్డ తర్వాతే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట. ఫిబ్రవరిలో విడుదల అయ్యి ఉంటే బాగుండేది. ఈ చిత్రం విషయంలో చైతూ బ్యాడ్‌ లక్‌ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

మాకు జాబ్ ఎలా ఇస్తారు..! యువతి ప్రశ్నకు లోకేష్ రాకింగ్ ఆన్సర్ | Nara Lokesh Mind blowing Answer

Posted : April 30, 2024 at 8:22 pm IST by ManaTeluguMovies

మాకు జాబ్ ఎలా ఇస్తారు..! యువతి ప్రశ్నకు లోకేష్ రాకింగ్ ఆన్సర్ | Nara Lokesh Mind blowing Answer

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement