Advertisement

సూపర్‌ హిట్‌ రీమేక్‌తో మెగా బ్రదర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ

Posted : March 24, 2021 at 7:32 pm IST by ManaTeluguMovies

మెగా బ్రదర్‌ నాగబాబు బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్దం అయ్యింది. తెలుగులో చాలా సినిమాల్లో నటించిన నాగబాబు ఇటీవల కాలంలో పెద్దగా నటనపై ఆసక్తి చూపించడం లేదు. యూట్యూబ్‌ లో వీడియోలు చేస్తూ అప్పుడప్పుడు బుల్లి తెరపై మెరుస్తున్నాడు. ఈ సమయంలోనే నాగబాబు బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అది కూడా మన తెలుగు సినిమా చత్రపతి రీమేక్ తో బాలీవుడ్‌ లో నాగబాబు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్‌ దర్శకత్వంలో చత్రపతి రీమేక్‌ తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రీమేక్‌ లో మెయిన్‌ విలన్‌ పాత్రను నాగబాబు పోషించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చత్రపతి హిందీ వర్షన్‌ కోసం పలు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రస్తుత జనరేషన్‌ కు తగ్గట్లుగా స్క్రిప్ట్‌ లో మార్పు చేస్తున్నారట. కనుక నాగబాబు పాత్ర ఎలా ఉంటుంది అనేది చూడాలి. మెగా బ్రదర్‌ నాగబాబు బాలీవుడ్‌ లో విలన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో మెగా బ్రదర్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Advertisement

Recent Random Post:

SWAG Theatrical Trailer | Sree Vishnu | Ritu Varma | Meera Jasmine | Hasith Goli | TG Vishwa Prasad

Posted : September 30, 2024 at 1:44 pm IST by ManaTeluguMovies

SWAG Theatrical Trailer | Sree Vishnu | Ritu Varma | Meera Jasmine | Hasith Goli | TG Vishwa Prasad

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad