Advertisement

తనపై వస్తున్న విమర్శలకు నాగబాబు కౌంటర్

Posted : May 21, 2020 at 7:47 pm IST by ManaTeluguMovies

మెగా బ్రదర్ నాగబాబు రెండు రోజుల క్రితం నాధూరామ్ గాడ్సేను నిజమైన దేశభక్తుడు అంటూ ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు ఏకంగా ఓ వీడియోనే రిలీజ్ చేశారు. నాగబాబు ట్వీట్ రాజకీయ రంగు పులుముకోవడంతో ఆయన ఈరోజు వివరణ ఇచ్చుకున్నారు కూడా..

‘గాడ్సేపై నేను చేసిన ట్వీట్ నా వ్యక్తిగత అభిప్రాయం. నా ట్వీట్ కు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేద’ అని ఈరోజు వివరణ ఇచ్చుకున్నారు. అయినా ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు. ‘నిజాన్ని ఒప్పుకోవడం చాలా కష్టం’ అనే అర్ధం వచ్చేలా ఓ కొంగ కప్పను మింగడానికి కష్టపడుతున్న క్యారికేచర్ ను పోస్ట చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

దీంతో తనపై రాజకీయంగా విమర్శలు చేస్తున్న వారికి నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చినట్టైంది. నాగబాబు జనసేన పార్టీ తరపున క్రియాశీలకంగా ఉన్నందున ఈ అంశం మరింతగా హైలైట్ అయింది. మరి నాగబాబు ఇచ్చిన కౌంటర్ తో అయినా ఆయనపై విమర్శలు ఆగుతాయేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

శ్రీకాళహస్తి పాలకోవాపై ప్రత్యేక కథనం | Srikalahasti Palakova | 50 Years Famous Palakova

Posted : September 15, 2024 at 9:07 pm IST by ManaTeluguMovies

శ్రీకాళహస్తి పాలకోవాపై ప్రత్యేక కథనం | Srikalahasti Palakova | 50 Years Famous Palakova

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad