అక్కినేని నాగార్జున గతేడాదే వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు. సీనియర్ హీరోస్ లో అందరికంటే ముందుగా షూటింగ్ మొదలుపెట్టాడు నాగార్జున. అయితే వైల్డ్ డాగ్ పూర్తైన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నాగార్జున రీసెంట్ గా బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర చిత్రాన్ని కూడా పూర్తి చేసాడు.
ఇక నిన్న నాగార్జున కొత్త సినిమా మొదలైన విషయం తెల్సిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించనున్నాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లు కలిసి నిర్మిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగార్జున యాంగర్ ఇష్యూస్ ఉన్న సెక్యూరిటీ చీఫ్ గా కనిపించనున్నాడట. ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం హైదరాబాద్ లో మొదలుకానుంది. తర్వాతి షెడ్యూల్ గోవాలో ఆ తర్వాత ఊటీ, లండన్ లలో కూడా చేయనున్నారు. అలాగే నాలుగు రోజుల షెడ్యూల్ కోసం సౌత్ కొరియాలో షూటింగ్ చేయనున్నారు. అక్కడ తెలుగు సినిమాలు రేర్ గా షూటింగ్స్ జరుగుతాయి.