కోవిడ్ విజృంభిస్తున్న ఈ సమయంలో కొందరు కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. కోవిడ్ వచ్చినా చనిపోతామో లేదో తెలియదు కాని వ్యాక్సిన్ తీసుకుంటే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది వ్యాక్సిన్ పై ఆసక్తి చూపడం లేదు. దాంతో ప్రముఖులు ముందుకు వచ్చి వ్యాక్సిన్ పై ఉన్న అనుమానాలను పటా పంచలు చేస్తున్నారు.
తాజాగా కింగ్ నాగార్జున తన మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ ను హైదరాబాద్ లో తీసుకున్నాడు. కోవాగ్జిన్ ను నిన్న తాను తీసుకున్నట్లుగా నాగార్జున ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఎలాంటి ఆందోళన లేకుండా ప్రతి ఒక్కరు కూడ ఆ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని వ్యాక్సిన్ చాలా సురక్షితమైనదిగా ఆయన పేర్కొన్నాడు. కరోనాకు దూరంగా ఉండాలంటే వ్యాక్సిన్ ను తీసుకోవాలంటూ ఆయన సూచించాడు. వెంటనే వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించాడు. ఇక నాగ్ నటించిన వైల్డ్ డాగ్ సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.