తెలుగు దేశం పార్టీ శాసన సభ ఉపనేత అయిన అచ్చెనాయుడును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈసందర్బంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అచ్చెనాయుడును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. బిసీ నాయుడు అయిన అచ్చెనాయుడును అరెస్ట్ చేసి బడుగులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. జగన్ ఏడాది ప్రభుత్వంపై గత కొన్ని రోజులుగా అచ్చెనాయుడు గారు విమర్శలు చేస్తున్న కారణంగానే ఆయనపై జగన్ ప్రభుత్వం కక్ష కట్టింది.
బీసీలకు న్యాయం చేస్తానంటూ చెప్పిన జగన్ ఇలా బీసీ నేత అయిన అచ్చెనాయుడును అరెస్ట్ చేయించడం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నాడు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడి 16 నెలలు జైల్లో ఉన్న జగన్ ఇప్పుడు అందరిని జైల్లో పెట్టాలనుకుంటున్నాడు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని ఆయన భావిస్తున్నాడు. కాని అంబేద్కర్ గారి రాజ్యంగం బలహీన వర్గా వారికి రక్షణగా ఉంటుందని ఈ సందర్బంగా నారా లోకేష్ అన్నారు.
శాసనసభాపక్ష ఉపనేత @katchannaidu గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కక్ష సాధింపులో భాగంగానే @ysjagan బీసీ నేత అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేయించారు. ఏడాది తుగ్లక్ పాలనలో జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడు పై జగన్ పగ పట్టారు.(1/3) pic.twitter.com/jp4DqzQSiI
— Lokesh Nara (@naralokesh) June 12, 2020