Advertisement

ప్ర‌భాక‌ర్ రెడ్డిని చంద్ర‌బాబు, లోకేష్ లే అరెస్టు చేయించారా?

Posted : June 13, 2020 at 2:42 pm IST by ManaTeluguMovies

150 కోట్ల రూపాయ‌ల స్కామ్ లో ఒక మాజీ మంత్రిని అరెస్టు చేస్తే.. దానిపై కుల రాజ‌కీయం చేయ‌బోయింది తెలుగుదేశం పార్టీ! తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో కుల చిచ్చును పెట్టింది చంద్ర‌బాబు నాయుడే అని, కులం పేరుతో మొత్తం రాజ‌కీయాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించింది చంద్ర‌బాబు నాయుడే అనే పేరు ఊరికే రాలేదు. భారీ స్కామ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ మంత్రిని అరెస్టు చేస్తే, ఆయ‌న బీసీ అని, బీసీల‌ను అణ‌గ‌దొక్కుతున్నారంటూ చెత్త రాజ‌కీయం చేసి, ఈ త‌రం చేత ఛీ కొట్టించుకుంటున్నారు చంద్ర‌బాబు నాయుడు. అయితే చంద్ర‌బాబు నాయుడుకు అలా ఛీ కొట్టించుకోవ‌డం అల‌వాటుగా మారింది. దీంతో ఆయ‌న అలానే చేస్తున్నారు.

అచ్చెన్నాయుడిని అరెస్టు చేస్తే.. కుల రాజ‌కీయం చేసిన టీడీపీ తెల్లారే స‌రికి జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిని అరెస్టు చేస్తే ఏం మాట్లాడాలో అర్థం కాని ప‌రిస్థితుల్లోకి ప‌డింది. అచ్చెన్నాయుడి అరెస్టును ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిని అరెస్టు చేశార‌ని ట్వీటేశార‌ట లోకేష్ బాబు! ఆ మేధావికి అలా అర్థం అయ్యింది.

24 చీటింగ్ కేసులు న‌మోద‌య్యాయి జేసీ ట్రావెల్స్ వ్య‌వ‌హారంలో. 150 కోట్ల స్కామ్ అచ్చెన్నాయుడి ది. ఈ విష‌యాల‌ను జ‌నాలు ప‌ట్టించుకోరు, తాము చెప్పిన సోది వింటూ ఉంటారేది చంద్ర‌బాబు, లోకేష్ ల భ్ర‌మ కాబోలు. అయితే జ‌నాల్లో ఇప్పుడు మ‌రో చ‌ర్చ జ‌రుగుతూ ఉంది. ఒక‌వేళ అచ్చెన్నాయుడి అరెస్టు పై తెలుగుదేశం కుల రాజ‌కీయం చేయ‌కుండా ఉండి ఉంటే, ఇప్పుడు ప్ర‌భాక‌ర్ రెడ్డి అరెస్టు అంత త్వ‌ర‌గా జ‌రిగి ఉండేది కాదేమో అని జ‌నాలు అనుకుంటున్నారు.

అచ్చెన్నాయుడి అరెస్టు చేస్తే టీడీపీ కుల ర‌చ్చ రేపింద‌ని, టీడీపీ దుర్మార్గ రాజ‌కీయం గురించి అర్థం చేసుకుని ఇక లేటు చేయ‌కుండా ప్ర‌భాక‌ర్ రెడ్డిని అరెస్టు చేసి జ‌గ‌న్ ప్ర‌భుత్వం సామాజిక న్యాయం చేసింద‌ని అంటూ, ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారు. ఈ విష‌యం జేసీ సోద‌రుల‌కూ అర్థం అయి ఉంటుంద‌ని, ఇప్పుడు వాళ్లు చంద్ర‌బాబును లోకేష్ ను బండ‌బూతులు తిట్టుకుంటూ ఉంటార‌ని టీకొట్టు కామెంట్లు వినిపిస్తున్నాయి!


Advertisement

Recent Random Post:

ఏపీకి చేదు వార్త.. ముంచుకొస్తున్న మరో గండం | Heavy Rains To AP

Posted : September 14, 2024 at 12:28 pm IST by ManaTeluguMovies

ఏపీకి చేదు వార్త.. ముంచుకొస్తున్న మరో గండం | Heavy Rains To AP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad