పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ బంకురలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన బెంగాళీల అభివృద్దిని మమత బెనర్జీ అడ్డుకుంటుంది అంటూ ఆరోపించారు. ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. దీదీ నా తలపై మీ కాలు పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కాని బెంగాల్ ప్రజల కలలను తన్నకండి. వారిని అభివృద్ది పథంలో నడుపుతున్న మాకు అడ్డు రాకండి అంటూ విజ్ఞప్తి చేశాడు.
మమత బెనర్జీ ముందుగానే తన ఓటమిని ఖరారు చేసుకుంది. అందుకే ఆమె ఈవీఎంలను అనుమానిస్తుంది ఇంకా ప్రజల నుండి సానుభూతి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మమత పదేళ్లుగా ఉత్తుత్తి హామీలకే పరిమితం అయ్యారు. ఈ పదేళ్ల కాలంలో బెంగాళీలు సాధించిన అభివృద్ది శూన్యం. అందుకే బీజేపీ ప్రభుత్వం రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని మోడీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం తుది దశకు వచ్చిన నేపథ్యంలో ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.