Advertisement

నయన్ స్ట్రెస్ బస్టర్ గా స్టార్ హీరోయిన్

Posted : April 12, 2022 at 12:40 pm IST by ManaTeluguMovies

నయనతార కోలీవుడ్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ స్టాటస్ ని ఎంజాయ్ చేస్తోంది. గత కొంత కాలంగా యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లో వుంటున్న నయనతార తన పెళ్లి గురించి మాత్రం పెదవి విప్పడం లేదు. పెళ్లి చేసుకున్నారని చేసుకోబోతున్నారని వరుస కథనాలు వినిపిస్తున్నా నయ తార నుంచి ఎలాంటి స్పందన లభించడం లేదు. అంతే కాకుండా యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కూడా ఈ వార్తలపై స్పందించడం లేదు.

ఎవరు ఎన్ని అనుకున్నా మాకు సంబంధం లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తూ వారి వ్యవహారాల్లో వారు బిజీగా వుంటున్నారు. గత ఆరేళ్లుగా డేటింగ్ లో వున్న ఈ జోడీపై రాని న్యూస్ అంటూ లేదు. అయితే వీరిద్దరూ ఫైనల్ గా 2021లో ఎంగేజ్ మెంట్ జరిగిందని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ ప్రకటించారు. అయితే తాజాగా వీరిద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నారని త్వరలో సరోగసీ ద్వారా ఓ పాపకు జన్మనివ్వబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యామయి. ఈ వార్తలపై కూడా నయనతార కానీ విఘ్నేష్ శివన్ కానీ స్పందించలేదు. కనీసం ఈ వార్తలని ఖండించనూ లేదు.

ఇదిలా వుంటే నయనతార నటించిన తాజా చిత్రం ‘కాతువాకులు రెండు కాదల్’ ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రంలో సమంత కూడా ఓ హీరోయిన్ గా నటించింది. నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విఘ్నేష్ శివన్ నయనతార లలిత్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫస్ట్ టైమ్ నయనతార సమంత కలిసి నటించిన చిత్రమిది. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి.

ఔట్ అండ్ ఔట్ ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని విఘ్నేష్ శివన్ తెరకెక్కించారు. నయనతార సమంత మధ్య వచ్చే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే సామ్ కు నయన్ కు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అది కాస్త డీప్ ఫ్రెండ్షిప్ గా మారిపోయిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల జరిగిన నయనతార పుట్టిన రోజు వేడుకల్లో సమంత మాత్రమే పాల్గొనడం.. ఇద్దరి మధ్య కుదిరిన బాండింగ్ ని తెలియజేసింది.

వీరిద్దరి మధ్య అనతి కాలంలోనూ బాడింగ్ చాలా స్ట్రాంగ్ గా మారిందట. వీరిద్దరి మధ్య బాడింగ్ ఎంత డీప్ గా మారిందంటే ప్రస్తుతం నయనతార స్ట్రెస్ బస్టర్ గా సమంత మారిపోయిందని చెబుతున్నారు.

స్టార్ హీరోయిన్ ల మధ్య స్నేహ బంధం అన్నది కామనే కానీ సామ్ – నయన్ మధ్య ఏర్పడిన బంధాన్ని వారి బాండింగ్ ని చూసిన వారంతా ప్రత్యేకంగా వీరి గురించి చర్చించుకుంటున్నారు. సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ యశోద వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ లో నయనతార నటిస్తోంది.


Advertisement

Recent Random Post:

టీడీపీ కంచుకోటాను దువ్వాడ బద్దలు కొడతారా? అచ్చెన్న హ్యాట్రిక్ విజయం ఖాయమేనా?

Posted : May 21, 2024 at 9:29 pm IST by ManaTeluguMovies

టీడీపీ కంచుకోటాను దువ్వాడ బద్దలు కొడతారా? అచ్చెన్న హ్యాట్రిక్ విజయం ఖాయమేనా?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement