Advertisement

అయిష్టంగా వ‌చ్చి…అగ్ర‌స్థానానికి ఎదిగిన హీరోయిన్‌

Posted : April 27, 2020 at 12:10 pm IST by ManaTeluguMovies

డాక్ట‌ర్ కాబోయి డాక్ట‌ర్ అయ్యాన‌నో, లేక మ‌రేదో అనుకుని…చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాన‌ని చెప్పే వాళ్ల‌ను చాలా మందినే చూసి ఉంటాం. కానీ అస‌లు త‌న‌కు ఏ మాత్రం ఇష్టం లేకుండానే సినిమా రంగంలోకి రావ‌డ‌మే కాదు…అగ్ర‌హీరోయిన్‌గా ఆ రంగాన్ని ఏలుతున్న ఒకేఒక్క న‌టి న‌య‌న‌తార‌. 30 ఏళ్ల వ‌య‌స్సులోనూ ఏ మాత్రం వ‌న్నె త‌గ్గ‌ని అందం ఆమె సొంతం.

సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లోనైనా, బికినీలోనైనా…న‌య‌న‌తార అందం వ‌ల్లే వాటికే వ‌న్నె తెచ్చింది. న‌య‌న‌తార అందాన్ని ఆస్వాదించేందుకు ఎంత‌సేపు చూసినా త‌న‌వి తీర‌దు. అందానికి ఆమె న‌ట‌న తోడ‌వ‌డంతో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. అగ్ర‌హీరోయిన్‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లో అగ్ర‌స్థానాన్ని ఆక్ర‌మించుకున్న నయనతారకు సినిమాలంటే అస‌లు ఇష్టం లేదంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఇష్టం లేకుండానే సినిమాల్లోకి వచ్చిన‌ట్టు ఆమె వెల్ల‌డించారు. సినిమాల‌పై అయిష్ట‌త గురించి ఆమె మాటల్లోనే….

‘నిజమే. నాకు సినిమాలంటే ఇష్టం లేదు. ఇంక నటన అంటే ఏకోశానా ఆసక్తి, ఇష్టమూ రెండూ లేవు. చదువుకుంటూనే మోడలింగ్‌ చేసేదాన్ని. 2003లో ఓ మలయాళీ సినిమాలో అవకాశమొచ్చింది. ముందు చేయననే అన్నాను. కానీ ఆ సినిమా దర్శకనిర్మాతలు నచ్చచెప్పడంతో ఒక్క సినిమా మాత్రమే చేయాలని నిర్ణయించుకుని ఆ సినిమా చేశాను. ఆ సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఆ ఏడాది దాదాపు ఎనిమిది సినిమాలకు ఓకే చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాను’ అని నయనతార చెప్పుకొచ్చారు.

ఇష్టం లేని రంగంలో ఈ స్థాయికి రావ‌డం ఎలా సాధ్య‌మ‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మే. కానీ న‌య‌న‌తార న‌ట‌న చూసిన త‌ర్వాత ఇష్టం లేని మ‌నిషి చేస్తున్న‌ట్టు ఏ మాత్రం అనిపించ‌దు.


Advertisement

Recent Random Post:

Jabardasth Latest Promo – 25th April 2024 – Indraja,Siri Hanmanth,Rocket Raghava,Saddam,Indraja

Posted : April 24, 2024 at 2:11 pm IST by ManaTeluguMovies

Jabardasth Latest Promo – 25th April 2024 – Indraja,Siri Hanmanth,Rocket Raghava,Saddam,Indraja

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement