Advertisement

ఈ అందాల నిధిని చూసేందుకు రెండు కళ్లు చాలవు

Posted : April 5, 2021 at 2:45 pm IST by ManaTeluguMovies

సవ్యసాచి మరియు మిస్టర్‌ మజ్ను చిత్రాలతో హీరోయిన్‌ గా తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ వరుసగా తెలుగులో సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది. మరో వైపు తమిళం మరియు హిందీల్లో కూడా ఈమెకు ఆఫర్లు దక్కుతున్నాయి. కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ ఆఫర్‌ ను ప్రస్తుతం నిధి అగర్వాల్‌ చేస్తుంది. అదే హరిహర వీరమల్లు. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో ముద్దుగుమ్మ ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ యువ రాణి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అమ్మడి సోషల్‌ మీడియా అకౌంట్‌ లో వరుసగా హాట్‌ అండ్‌ క్యూట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌ కు కన్నుల వింధు అన్నట్లుగా చేస్తోంది.

తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటోలను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సింపుల్‌ అండ్‌ స్వీట్‌ లుక్‌ లో నిధి అగర్వాల్‌ ఈసారి సోషల్‌ మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యింది. ఎప్పుడు లేని విధంగా మెడలో ఆభరణాలు ధరించి వైట్‌ స్పోర్ట్స్‌ ఇన్నర్‌ లో నిధి అగర్వాల్‌ లుక్‌ అదిరింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చూపులు కూడా గుండెలకు గుచ్చుకుంటున్నట్లుగా ఉన్నాయని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి నిధి అగర్వాల్‌ ఫొటో షూట్‌ మళ్లీ వైరల్‌ అయ్యింది.


Advertisement

Recent Random Post:

Special Focus on Operation Boats | ఇప్పటివరకు వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ |

Posted : September 15, 2024 at 8:01 pm IST by ManaTeluguMovies

Special Focus on Operation Boats | ఇప్పటివరకు వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad