Advertisement

నిహారిక పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్‌ చేసిన నాగబాబు

Posted : May 13, 2020 at 7:00 pm IST by ManaTeluguMovies

ఒక వైపు కరోనా విజృంభిస్తున్నా కూడా తెలుగు ఇండస్ట్రీలో మాత్రం పెళ్లిలు వరుసగా జరుగుతున్నాయి. ఇటీవలే దిల్‌రాజు వివాహం చేసుకోగా రేపు హీరో నిఖిల్‌ పెళ్లికి రెడీ అయ్యాడు. ఇక వచ్చే నెలలో నితిన్‌ కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఇదే సమయంలో రానా కూడా తన పెళ్లి ప్రకటన చేశాడు. డిసెంబర్‌కు ముందే రానా పెళ్లి జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలోనే మెగా బ్రదర్‌ నాగబాబు కూడా తన కూతురుకు పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

నిహారిక మరియు ప్రభాస్‌లు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి. అంతకు ముందు ఒక యంగ్‌ హీరోతో ఈమె ప్రేమలో ఉందని కూడా వార్తలు వచ్చాయి. కాని అవన్నీ కూడా పుకార్లే అంటూ కొట్టిపారేశారు. ఎట్టకేలకు నాగబాబు తన కూతురు విషయంలో ఆసక్తికర ప్రకటన చేశాడు. తాజాగా నాగబాబు మాట్లాడుతూ తన కూతురుకు వచ్చే ఏడాదిలో వివాహం చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

నాగబాబు మాట్లాడుతూ.. నిహారిక కోసం ఒక మంచి అబ్బాయిని చూసే పనిలో ఉన్నాం. త్వరలోనే మంచి సంబంధం దొరికితే తప్పకుండా పెళ్లి చేస్తాం. వచ్చే ఏడాదిలో పెళ్లి జరుగుతుందని చెప్పుకొచ్చాడు. అలాగే వరుణ్‌ పెళ్లి కూడా వెంటనే చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది చివరికి లేదా 2022లో ఖచ్చితంగా వరుణ్‌ పెళ్లి ఉంటుందని ఈ సందర్బంగా నాగబాబు తెలియజేశాడు.


Advertisement

Recent Random Post:

Nellore : రైల్లోంచి సూటికేసు విసిరేసిన తండ్రి కూతుళ్లు

Posted : November 5, 2024 at 2:31 pm IST by ManaTeluguMovies

Nellore : రైల్లోంచి సూటికేసు విసిరేసిన తండ్రి కూతుళ్లు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad