Advertisement

రెండో మెగా అల్లుడు కూడా హీరో బాట పడతాడా?

Posted : November 20, 2020 at 10:43 pm IST by ManaTeluguMovies

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిశ్చితార్ధం కొన్ని వారాల క్రితం అట్టహాసంగా జరిగిన విషయం తెల్సిందే. హైదరాబాద్ లో పనిచేస్తోన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చైతన్య జొన్నలగడ్డతో నిహారిక నిశ్చితార్ధం జరిగింది. డిసెంబర్ 9న నిహారిక-చైతన్యల వివాహ వేడుక జరగనున్నట్లు అధికారికంగా తెలుస్తోంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో వీరి వివాహం జరుగుతుంది. మెగా ఫ్యామిలి మొత్తం ఈ వివాహానికి హాజరవుతుంది.

ఇక చైతన్యను చూసి మెగా అభిమానులు ముచ్చట పడుతున్నారు. సాధారణంగా మెగా హీరోలు అందరూ యావరేజ్ హైట్ లోనే ఉంటారు. ఒక్క వరుణ్ తేజ్ మాత్రమే ఆరడుగుల కంటే ఎత్తు ఉండి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు చైతన్య కూడా వరుణ్ తేజ్ కు తగ్గ హైట్ లోనే ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

హైట్ మాత్రమే కాకుండా చైతన్య లుక్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే జరిగిన నిశ్చితార్ధ వేడుకలో చైతన్య కోర మీసాలతో ఆకర్షించాడు. చైతన్యను చూసిన మెగా అభిమానులు ఇండస్ట్రీకి మరో మెగా హీరో వస్తున్నాడని అంటున్నారు. మరి చైతన్యకు సినిమాలు అంటే ఏ మాత్రం ఆసక్తి ఉన్నా కానీ అతను హీరో కావడం తథ్యం. ఇప్పటికే మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా స్థిరపడడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి మరో మెగా హీరో కూడా ఈ బాటలోనే నడుస్తాడేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

Be Alert : తల్లి కోసం కూతురు దారుణ నిర్ణయం

Posted : October 31, 2024 at 12:54 pm IST by ManaTeluguMovies

Be Alert : తల్లి కోసం కూతురు దారుణ నిర్ణయం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad